జాతీయ వార్తలు

నల్ల ధనానికి కేరాఫ్.. మొసాక్ ఫొనె్సకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా సిటీ, ఏప్రిల్ 4: ప్రపంచ వ్యాప్తంగా వివిధ మీడియా సంస్థలు ప్రచురిస్తున్న ‘పనామా పేపర్స్’ నల్లధనం కుంభకోణానికి కేంద్రంగా లా ఫర్మ్ మొసాక్ ఫొనె్సకా నిలిచింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటింగ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె), దాని భాగస్వామ్య మీడియా సంస్థలు పనామా కేంద్రంగా పనిచేస్తున్న ఈ మొసాక్ ఫొనె్సకా న్యాయసంబంధ సంస్థకు చెందిన రహస్య పత్రాలను బయటపెట్టడంతో ఈ సంస్థ వివిధ దేశాలకు చెందిన పన్నుల ఎగవేతదారులకు ఎలా కేంద్రంగా మారిందనే విషయం ఒక్కసారిగా లోకానికి తెలిసింది. ఐసిఐజె విడుదల చేసిన 11 మిలియన్ల పేజీల రహస్య పత్రాలలో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, వాణిజ్యవేత్తలు అనేకమంది ఉన్నారు. బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలతో పాటు కొన్ని పసిఫిక్ మహాసముద్ర దేశాలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు పన్నుల ఎగవేతకు వివిధ టెక్నిక్కులను మొసాక్ ఫొనె్సకా ఉపయోగించిందనే విషయం ఈ కుంభకోణంతో వెల్లడయింది. అయితే సంపన్నులయిన అనేక మంది క్లయింట్లకు విదేశాలలో ఉన్న ఆస్తులను వెల్లడించడం నేరమని, అది పనామాపై దాడి చేయడమే అవుతుందని మొసాక్ ఫొనె్సకా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరయిన రామన్ ఫొనె్సకా అన్నారు. ఇద్దరు న్యాయవాదులు- జుర్గెన్ మొసాక్, రామన్ ఫొనె్సకా కలిసి మూడు దశాబ్దాల క్రితం పనామాలో లా ఫర్మ్ మొసాక్ ఫొనె్సకాను స్థాపించారు. 1948లో జర్మనీలో జన్మించిన మొసాక్ తన కుటుంబంతో కలిసి పనామాకు వలస వచ్చారు. ఇక్కడే ఆయన న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. నాజీ అయిన మొసాక్ తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌కు చెందిన వాఫెన్-ఎస్‌ఎస్‌లో పనిచేశారు. పాత ఇంటెలిజెన్స్ పత్రాలను ఉటంకిస్తూ మొసాక్ తండ్రిని సిఐఎ ఏజెంటుగా పనిచేయాలని అమెరికా కోరిందని ఐసిఐజె తెలిపింది.