జాతీయ వార్తలు

ఒకేసారి ఎన్నికలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జూలై 5: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని న్యాయ మంత్రిత్వ శాఖకు తాము సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే భారత్ వంటి దేశంలో ఈ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు సంబంధించి లోపరహితమైన రీతిలో నిర్వహణాపరమైన ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సముపార్జన, సిబ్బంది నియామకం అవసరాలకు తగ్గట్టుగా ఎన్నికల తేదీల పొడిగింపు వంటి వాటిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన జైదీ పిటిఐ వార్తా సంస్థలో మాట్లాడారు. న్యాయ శాఖతోపాటు ఏకకాల ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనను తాము పార్లమెంటరీ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయితే ఇందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అవసరమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. దేశంలో ఒక్కో అసెంబ్లీ పదవీకాలం ముగిసే తేదీలు భిన్నంగా ఉన్నాయని, వాటన్నింటినీ ఒకే వరసకు తీసుకురావాలంటే, కొన్ని అసెంబ్లీల పదవీకాలం కుదించడం, కొన్ని అసెంబ్లీల పదవీకాలం పొడిగించడం వంటి మార్పులు చేయాల్సి అవసరం ఉందని, ఇందకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని జైదీ వెల్లడించారు. తమకు సంబంధించినంతవరకు మిగతా ఏర్పాట్లన్నీ లోపరహితంగా జరిగితే ఏకకాల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమానికి మొత్తం 19 దేశాలకు చెందిన ఎన్నికల కమిషనర్లు హాజరయ్యారు. అన్ని దేశాల మధ్య ఎన్నికల నిర్వహణ విషయంలో సరైన అవగాహన పెంపొందించేందుకు భాగస్వామ్యానికి వీలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఆస్ట్రేలియా ఎన్నికల ప్రక్రియ అత్యంత సరళతరంగా, పారదర్శకంగా ఉందని జైదీ తెలిపారు. ముఖ్యంగా ఓటర్ల విశ్వసనీయత, రాజకీయ పార్టీల మధ్య సహకారం, అలాగే ఎన్నికల ప్రచారం మొదలైనవన్నీ కూడా ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని భారతదేశంలో జరిగే ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రవాస భారతీయులకు సరైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.