అంతర్జాతీయం

అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: అవినీతి ఆరోపణలపై శిక్షపడి జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్, అతని కుటుంబ సభ్యులకు పాకిస్తాన్ ఉన్నత న్యాయస్థానం గొప్ప ఊరట కలిగించింది. కింద కోర్టు విధించిన శిక్షను బుధవారం రద్దు చేస్తూ వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. లండన్‌లో లగ్జరీ ఫ్లాట్ల కొనుగోలు కేసుకు సంబంధించి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (68), అతని కుమార్తె మరయమ్, అల్లుడు కెప్టెన్ మహమ్మద్ సఫ్దార్‌లకు అకౌంటబిలిటీ కోర్టు జడ్జి మహమ్మద్ బషీర్ లకు వరుసగా 11 ఏళ్లు, 8 ఏళ్లు, ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ జూలై 6న తీర్పు చెప్పారు. దీంతో వారిని రావల్పిండి జైలుకు తరలించారు. దానిపై హైకోర్టుకు అప్పీల్ చేయగా కేసు విచారించిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం రావల్పిండిలోని అడియాల జైలు నుంచి వారిని విడుదల చేయాలని ఆదేశించింది. వారు 5 లక్షల విలువైన బెయిల్ బాండ్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కేసు ఆలస్యానికి ప్రయత్నించిన ఎన్‌ఎబి న్యాయవాదులకు జరిమానా విధించింది. కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ ముస్లింగ్ లీగ్-నవాజ్ (పిఎంఎల్- ఎన్)కు చెందిన నేతలు షేష్‌బాజ్ షరీఫ్, పర్వేజ్ రషీద్, ఖుర్రందస్తగిర్, పలువురు కార్యకర్తలు కోర్టురూముకు వచ్చారు. కా గా, పనామా, ఇతర కేసులకు సంబంధించి గతం లో షరీఫ్‌పై దాఖలైన కేసులకు సంబంధించి విచారించిన సుప్రీం ఆయన ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే.

చిత్రం..ఇస్లామాబాద్ హైకోర్టు ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా నినాదాలిస్తూ,
విజయ ముద్రను ప్రదర్శిస్తున్న ఆయన మద్దతుదారుడు