అంతర్జాతీయం

ఉభయ కొరియా దేశాధినేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యాంగ్‌యాంగ్, సెప్టెంబర్ 20: దశాబ్ధాల తరబడి శత్రుత్వంతో మెలిగిన ఉభయ కొరియా దేశా లు శాంతి దిశగా పయనిస్తున్నాయి. గురువారం ఉత్తరకొరియా, చైనా సరిహద్దులోని వాల్కనో పర్వత ప్రాంతంలో ఇరు దేశాధినేతలు కలుసుకుని కరచాలనం చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ప్రత్యేక విమానాల్లో వౌంట్ పేక్టూకు చేరుకున్నారు. అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేస్తున్న దృశ్యాలు కొరియాప్రజలను ఆనందపరిచాయి. ఇరుదేశాల నేతలు నవ్వులు చిందించారు. ఈ కార్యక్రమంలో అధినేతల భార్యలు కూడా పాల్గొనడం విశేషం. కొరియా దేశాల్లో ఈ ప్రాంతానికి మతపరంగా, చారిత్రక,సాంస్కృతిక పరంగా గాఢమైన అనుబంధం ఉంది. ప్రాచీన కాలంలో కొరియా రాజ్యం తొలి వ్యవస్థాపకుడు డాంగన్ జన్మ స్థలం వాల్కనో ప్రాంతంలో ఉందని ప్రజలు విశ్వసిస్తారు. ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతంలో కొరియా దేశాధినేతల సమావేశం ప్రపంచ దేశాలను ఆకర్షించింది. కాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఇరుదేశాధినేతల సమావేశాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. కాగా ఇరు దేశాధినేతలు గతంలో మాదిరిగానే ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. తమ దేశంలోని క్షిపణుల ప్రాంతాలను అంతర్జాతీయ నిపుణులు తనిఖీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కిమ్ హామీ ఇచ్చారు. 2032లో ఇరుదేశాలు ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు తగిన సదుపాయాలను సమిష్టిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా తమదేశంలో అణ్వస్త్రాల ప్రదేశాల గురించి వెల్లడించేందుకు ఉత్తర కొరియా ఎప్పటిలాగనే నిరాకరించింది. అణునిరాయుధీకరణ దిశగా తీసుకునే చర్యలపై వివరించేందుకు ఉత్తర కొరియా ఆసక్తి కనపరచలేదు. కొరియా దేశాలను శాంతికి, అణ్వస్త్ర రహిత ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు, ఆయుధాల ముప్పు నుంచి తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇరు దేశాధినేతలు ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం..భేటీ అనంతరం అభివాదం చేస్తున్న ఇరు దేశాల అధినేతలు