అంతర్జాతీయం

ఉగ్రవాదం పీచమణచడంలో భారత్ చర్యలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 20: ఉగ్రవాదం పీచమణచడంలో భారత్ సంయమనంతో వ్యవహరిస్తూనే సరిహద్దు చొరబాట్లను అణచివేసే తీరును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్నాయని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన కంట్రీ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం నివేదికలో పేర్కొంది. దేశీయంగా భారత్ ఉగ్రవాదం అణచివేతకు కఠిన చర్యలు తీసుకుంటోందని, సరిహద్దు ఉగ్రవాద చర్యలను ఎండగట్టడంలో అమెరికా తదితర దేశాల సహకారంతో ముందడుగు వేస్తోందని నివేదికలో పేర్కొన్నారు. మతపరమైన ఉగ్రవాదం, మిలిటెన్సీ, మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలను భారత్ సమర్థంగా ఎదుర్కొంటున్నదని తెలిపింది.