అంతర్జాతీయం

భారత్ కృషి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: 2017వ సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేసిన కృషిలో గణనీయమయిన పురోగతిని సాధించిన 14 దేశాలలో భారత్ ఉందని అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ‘2017లో భారత్ బాలకార్మిక వ్యవస్థలోని అ త్యంత అధ్వాన్న స్థితిలో ఉన్న రూపాలను నిర్మూలించడానికి చేసిన కృషిలో గణనీయమైన పురోగతిని సాధించింది’ అని అమెరికా కార్మిక శాఖ ‘బాల కార్మికులు, వెట్టి చాకిరి’ పేరిట రూపొందించిన తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్- 2000’ ప్రకారం తప్పనిసరి అయిన ‘బాలకార్మిక వ్యవస్థలోని అత్యంత అధ్వాన్నమయిన రూపాలను గుర్తించడం’ అనేది ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మిక వ్యవస్థ స్థితిగతులపై అత్యంత సమగ్రమయిన పరిశోధన ఫలితమని ఆ నివేదిక పేర్కొంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు 132 దేశా లు, భౌగోళిక ప్రాంతాలు చేస్తున్న కృషిని మదింపు వేయడానికి ఈ ఏడాది మరింత కఠినమైన ఆధారాలను ఉపయోగించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొలంబియా, పరాగ్వే, భారత్ సహా కేవలం 14 దేశాలు కొత్త ప్రాతిపదిక ప్రకారం బాలకార్మిక వ్యవస్థలోని అత్యంత అధ్వాన్నమైన రూపాలను నిర్మూలించడానికి చేసిన కృషిలో గణనీయమయిన పురోగతిని సాధించాయని నివేదిక పేర్కొంది. భారత ప్రభుత్వం ఐఎల్‌ఓ కనె్వన్షన్ 182, కనె్వన్షన్ 183లను అంగీకరించి, స్థిరపరచిందని, అందుకు అనుగుణంగా ప్రమాదకరమయిన పని ప్రదేశాలలో 18 సంవత్సరాల లోపు వయసు గల బాలలు పనిచేయడాన్ని నిషేధిస్తూ బాలకార్మిక చట్టానికి సవరణలు చేసిందని అమెరికా కార్మిక శాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. బాలకార్మిక చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి బాలకార్మిక వ్యవస్థ ఉండకూడదనే లక్ష్యంతో కృషి చేయడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ‘జాతీయ బాలకార్మిక వ్యవస్థ (నిర్మూలన) కార్యక్రమాన్ని’ అమలు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. దీంతో పాటు భారత ప్రభుత్వం బాలలకు సంబంధించి ఒక కొత్త జాతీయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిందని, ఈ ప్రణాళిక కింద బాలలకు సంబంధించి ఓ జాతీయ విధానం అమలు అవుతోందని అమెరికా కార్మిక శాఖ నివేదిక వివరించింది. ఈ జాతీయ విధానం బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, ఇతర దయనీయ స్థితిలో ఉన్న పిల్లల సంక్షేమంపై కేంద్రీకరించి పనిచేస్తుందని ఆ నివేదిక పేర్కొంది.