అంతర్జాతీయం

సైనిక కవాతుపై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, సెప్టెంబర్ 22: ఇరాన్‌లో సైనిక కవాతుపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 24 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఇరాన్‌లోని చమురు సంపద అధికంగా గల నైరుతి ప్రాంతమయిన అహ్వాజ్‌లో నిర్వహిస్తున్న మిలటరీ పరేడ్‌పై ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కవాతులో పాల్గొన్న సైనిక సిబ్బంది, పక్కన నిలబడి వీక్షిస్తున్న ప్రజలు, సమీపంలోని ఎత్తయిన వేదికపై నుంచి కవాతును చూస్తున్న ప్రభుత్వాధికారులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇరాన్‌లోని ఈ ప్రాంతంలో గతేడాదీ భీకరదాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు, అరబ్ వేర్పాటువాదులు ఈ ప్రాంతంలోని చమురు పైప్‌లైన్లపై దాడులకు తెగబడ్డారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకొని ఉన్న అణుఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరువాత, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి ఈ ప్రాంతంలోని దేశాలు, వాటి ‘అమెరికా సూత్రధారులు’ శనివారం నాటి దాడికి తెగబడ్డారని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావేద్ జరీఫ్ ఆరోపించారు. ‘ఇరాన్ ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసం ఇరాన్ వేగంగా, నిష్కర్షగా ప్రతిస్పందిస్తుంది’ అని జావేద్ దాడి జరిగిన వెంటనే ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. అహ్వాజ్‌లో సైనిక కవాతుపై జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది.

చిత్రం..కాల్పులు జరుగుతుండగా ఓ మహిళ తన చిన్నారులను ఆశ్రయానికి తరలిస్తున్న దృశ్యం