అంతర్జాతీయం

శాంతిని వీడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: తమతో చర్చలు జరిపేందుకు భారత్ విముఖంగా ఉన్నప్పటికీ దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన ప్రయత్నాలను తాము కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల హత్య నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో జరుపతలపెట్టిన చర్చలను భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాస్తవాల నుంచి తప్పించుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని, ముఖ్యంగా కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ఇది ఎంత మాత్రం దోహదం చేయదని ఖురేషీని ఉటంకిస్తూ ది డాన్ పత్రిక తెలిపింది. అసలు పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎందుకు ఆసక్తిచూపడం లేదో తనకు అర్థం కావడం లేదని కూడా ఖురేషీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా, చర్చలకు వచ్చినా రాకపోయినా తాము మాత్రం అర్థవంతమైన రీతిలో శాంతి చర్చల ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటామని, ఇందుకోసం తమ ద్వారాలను అన్ని వేళలా తెరిచే ఉంచుతామని ఆయన అన్నారు. తాము చేసిన శాంతి ప్రయత్నాల ప్రతిపాదనకు భారత ప్రతిస్పందన కఠినంగా, దౌత్య నీతికి రీతికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు.