అంతర్జాతీయం

ఉగ్రవాదంతోనే పెనుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మపుటో, జూలై 7: వివిధ దేశాల్లో వరుసగా జరగుతున్న ఉగ్ర దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తీవ్రంగా స్పందించారు. ప్రపంచానికి అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉగ్రవాదం పరిణమించిందన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్ చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపె న్యూసితో విస్తృతమైన ద్వైపాక్షిక చర్చల అనంతరం మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఇతర నేరాలతో ఉగ్రవాదుల నెట్‌వర్క్ అనుసంధానమై పనిచేస్తోందని ఆయన అన్నారు. మొజాంబిక్ భారత్‌కు నమ్మకమైన భాగస్వామి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆ దేశం నుంచి పప్పుదినుసులను దిగుమతి చేసుకునేందుకు దీర్ఘకాలిక ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. భారత్‌లో పప్పు్ధన్యాల ధరలను అదుపు చేయటానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని మోదీ అన్నారు. మొజాంబిక్ రైతుల ఆదాయం పెరుగుదలకు కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో మొజాంబిక్‌కు ఎయిడ్స్‌తో సహా వివిధ రకాల రుగ్మతల చికిత్సకు అవసరమైన మందులను విరాళంగా ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. మొజాంబిక్‌లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మొజాంబిక్ రక్షణ బలగాల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా సహకరిస్తామని మోదీ అన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని మోదీ వివరించారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు, సముద్రమార్గంపై టెర్రరిజం ముప్పును ఎదుర్కోవటానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. వ్యవసాయ వౌలిక రంగ అభివృద్ధి, ఉత్పాదక వ్యవస్థల పురోగతికి సంబంధించి మొజాంబిక్‌కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఆఫ్రికాకు మొజాంబిక్ గేట్‌వే లాంటిదని అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మోదీ అన్నారు.

చిత్రం.. గురువారం మొజాంబిక్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపె న్యూసితో భేటీ అయన ప్రధాని నరేంద్ర మోదీ