అంతర్జాతీయం

ఎక్కడ చూసినా శిథిలాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలూ/వానీ, (ఇండోనేషియా), అక్టోబర్ 3: ప్రకృతి విపత్తు సునామీ విసిరిన పంజాతో ఇండోనేషియా విలవిలలాడుతోంది. భూకంపం, సునామీ తాకిడికి దాదాపు 1400 మంది మరణించారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు ప్రకృతి విపత్తు ఏజన్సీ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఎక్కడ చూసినా శిథిలాలే. సముద్ర తీరం వెంట నిర్మించిన గిడ్డంగులన్న కూలిపోయాయి. తిండికోసం ప్రజలు ఆవురావురుమంటున్నారు. గుప్పెడు మెతుకుల కోసం ప్రజలు నగరాలకు చేరుతున్నారు. హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇంతవరకు వెలికితీసిన మృతదేహాల్లో 519 మృతదేహాలను ఖననం చేవారు. వచ్చే శుక్రవారం కోసం శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఆనే్వషణ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. హోటల్ రోవా రోవా కుప్పకూలింది. కనీసం 60 మంది సజీవ సమాధి అయ్యారనిభావిస్తున్నారు. బాలారోవా ఏరియాలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. 150 మంది ప్రజలు గల్లంతయ్యారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 66వేల గృహాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 నమోదుకావడం, సునామీ విరుచుకుపడడంతో ప్రాణ, ఆస్తినష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. డోంగాల ప్రోవిన్స్‌లో వానీ అనే గ్రామం పూర్తిగా శిథిలమైంది. కాగా ఇండోనేషియా ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేయాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి బృందం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో ఏ మేరకునష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా సరైన అంచనాలు లేవు. ప్రభుత్వ అధికారులు అక్కడకు చేరుకుంటే కాని నష్టం వివరాలు తెలియవని ఐరాస అధికారులు చెప్పారు. డోంగాల ప్రొవిన్స్‌లో దాదాపు 3.10 లక్షల మంది బాధితులున్నారని ఐరాస పేర్కొంది. వీరికి సహాయం చేరాల్సి ఉంది. పాలూస్ పోర్టు నుంచి సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రోడ్డు మార్గాలన్నీ ఎక్కడికక్కడ మరమ్మత్తులు చేయడానికి వీలు లేనంతగా పాడైపోయాయి. ఇండోనేషియాను ఆదుకునేందుకు 15 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందిస్తామని ఐరాస ఇప్పటికే ప్రకటించింది. కొన్ని చోట్ల పెట్రోలు కోసం చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్యం సవాలుగా మారింది. పాలూ ప్రాంతంలో ప్రజల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. శిథిలాలుగా మారిన పెద్ద షాపింగ్ మాల్స్, గిడ్డంగుల వద్ద బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. గ్రామాల్లో తినేందుకు తిండి లేదు. ఆకలితో వేలాది మంది అలమటిస్తున్నారని, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని 23 ఏళ్ల రెహనా అనే కాలేజీ విద్యార్థిని చెప్పారు. పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయన్నారు. భూకంపం తీవ్రమైన విషాదాన్ని నింపిందన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవి విడోడో ఇప్పటికే రెండు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించి స్వయంగా సాయం చేరవేత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చిత్రం..భూకంపం, సునామీ తాకిడికి ఎటుచూసినా పేకమేడల్లా కూలిన ఇళ్లే. గూడుచెదిరి నిరాశ్రయులై, అక్కడే దుస్తులు ఉతుక్కుంటున్న ఓ కుటుంబం