అంతర్జాతీయం

యూపీలో నవంబర్ 18నుంచి భారత్-రష్యా సైనిక దళాల కవాతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, అక్టోబర్ 3: రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ భారత పర్యటనను పురస్కరించుకుని నవంబర్ 18 నుంచి 28 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో భారత-రష్యా సేనల సంయుక్త ప్రదర్శనలు జరుగనున్నాయి. ‘ఇంద్ర 2018’ పేరిట జరిగే ఈ ప్రదర్శనల్లో రష్యన్ తూర్పు మిలటరీ యూనిట్స్‌లోని పదాతి దళాలకు చెందిన 250 మంది సైనికులు పాల్గొంటారని ఆ యూనిట్‌కు చెందిన అధికారులు బుధవారం నాడిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. భాతర ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఈ నెల 4 నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోబాటు రక్షణ రంగంలో పరస్పర సహకారంపై ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ‘ఇంద్ర 2018’ పేరిట భారత-రష్యా సంయుక్త ప్రదర్శనలు జరుగుతాయని ఆ అధికారులు వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాబినా నగరంలోని శిక్షణ మైదానంలో నవంబర్ 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో రష్యా పదాతి దళానికి చెందిన 250 మంది సైనికులు పాల్గొంటారని తెలిపారు.