అంతర్జాతీయం

సౌదీ పాత్రికేయుడు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 3: విమర్శకుడు, వెటరన్ సౌదీ పాత్రికేయుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఇస్తాంబుల్‌లోని రాజుగారి కాన్సులేట్‌కు వెళ్లిన తర్వాత ఆయన కన్పించకుండా పోయాడని, వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. పాత్రికేయుడు జమల్ ఖషౌగి తన కాబోయే భార్యతో కలిసి ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్‌కు వెళ్లాడు. ఆయన భార్యను విజిటింగ్ రూమ్‌లో ఉంచి లోపలికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కాన్సులేట్‌ను మూసివేయగా, ఆయన మాత్రం బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె ఈ విషయాన్ని అధికారులకు తెలిపింది. గత ప్రభుత్వ సలహాదారుడిగా సైతం వ్యవహరించిన ఖషౌగి, తనను అరెస్టు చేస్తారన్న భయంతో గతేడాది నుంచి అమెరికాలో ప్రవాసునిగా ఉంటున్నాడు. యెమన్‌లోని యుద్ధంలో సౌదీ రాజు మహ్మద్ బీన్ స ల్మాన్, రియాద్ జోక్యంపై ఆయన విమర్శలు చేశాడు. జమల్ ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని వాషింగ్టన్ పోస్టు ఒపీనియన్ ఎడిటర్ ఎలి లోపెజ్ ఒక ప్రకటనలో తెలిపార. ఒక పాత్రికేయునిగా, కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన వృత్త్ధిర్మానికి ఆటంకం కలిగించేలా ఎవరు వ్యవహరించినా అది తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు.