అంతర్జాతీయం

మహిళల వస్తువులపై పన్ను తగ్గించిన ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 3: దాదాపు రెండు దశాబ్దాల పోరాటం, నిరసనల అనంతరం మహిళలకు సంబంధించిన శానిటరీ నేప్‌కీన్ తదితర వస్తువులపై పన్నును రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం 2000లో జీఎస్టీని ప్రవేశపెట్టింది. కొన్ని ఆహార ఉత్పత్తులతో పాటు కండోమ్స్, సన్‌స్క్రీన్ తదితర వస్తువులపై 10 శాతం పన్ను రాయితీని కల్పించింది. అయితే మహిళలు ఉపయోగించే శానిటరీ నేప్‌కిన్, మరికొన్ని ఉత్పత్తులపై టాక్స్‌ను అలాగే కొనసాగించింది. వీటిపై పన్నును రద్దు చేయాలని అన్నివర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. అప్పట్లో ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి మైఖైల్ ఊల్డ్ రిడ్జ్ మాట్లాడుతూ ఇవి ఆరోగ్యపరమైన ఉత్పత్తులు కాదు కాబట్టి వీటిపై పన్నును రద్దు చేయలేమని స్పష్టం చేశారు. దీనిపై అప్పటి నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘మా రుతు సమయంలో పన్ను విధించడం మానండి’ అంటూ ప్రచారం, ‘రుతు మహిళలపై పగపట్టిన పాలకులు’ అంటూ గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. వీరు చేస్తున్న పోరాటానికి రెండు దశాబ్దాల అనంతరం ఫలితం లభించింది. బుధవారం ఈ వస్తువులపై పన్నును ఎత్తివేయాలని ఏకగ్రీవంగా ప్రభుత్వం నిర్ణయించడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియా మహిళలకు ఇది మేలు చేసే నిర్ణయమని మహిళా శాఖ మంత్రి కెల్లీ ఒ డ్వయర్ వ్యాఖ్యానించారు.