అంతర్జాతీయం

చర్చలకు వస్తేనే తెరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 4: సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లో తమ మత పవిత్ర మందిరాలను దర్శించుకునేందుకు వీలుగా భారత్-పాక్ మధ్య కర్తాపూర్ సరిహద్దును తెరుస్తారా ? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలు నిలిచిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమైతే, కర్తాపూర్ సరిహద్దును తెరిచే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్‌తో శాంతిని కోరుకుంటోందన్నారు. చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరగనంత మాత్రాన ఏమి జరగదన్నారు. కాని భారత్‌తో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో కర్తాపూర్ సరిహద్దు ఉంది. ఈ చెక్‌ప్టో నరోవాల్ జిల్లాలో ఉంది. ఈ పుణక్షేత్రాన్ని సిక్కుల మొదటి గురువు 1522 లో స్థాపించారు. మొదటి గురుద్వారా కర్తాపూర్ సాహిబ్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడే గురునానాక్ దేవ్ అస్తమించారు. రవి నదీ తీరంలో ఈ పుణక్షేత్రం ఉంది.