అంతర్జాతీయం

దూసుకుపోతున్న వాయేజర్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 7: అంతరిక్ష శోధనలో అమెరికా మరింత దూసుకుపోతోంది. నాసా ప్రయోగించిన వాయేజర్-2 వ్యోమనౌక రోదసీ లోతుల్లోకి వెళ్లిందని అక్కడ కాస్మిక్ కిరణాల తీవ్రతనూ కనిపెట్టిందని నిపుణులు వెల్లడించారు. సౌర వ్యవస్థ ఆవలి నక్షత్ర మండలి ప్రాంతాన్ని సమీపించిన ఈ వ్యోమ నౌక అక్కడ కాస్మిక్ కిరణాల ఉద్ధృతిని గుర్తించడం అంతరిక్ష పరిశోధనలో ఓ కీలక ముందడగని నాసా ప్రకటించింది. 1977లో ప్రయోగించిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి 17.7 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యడికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే 118 రెట్లు ఎక్కువన్నమాట. 2007 నుంచి ఈ వ్యోమనౌక మరింతగా సౌర వ్యవస్థ ఆవలి నక్షత్ర మండలి ప్రాంతంలోకి వేగంగా దూసుకుపోతోందని నాసా తెలిపింది. సౌర పదార్థాలు, అయస్కాంత క్షేత్రాల మయంగా ఉండే హెలియోస్పీయర్ ఎగువ పొర గుండా వాయేజర్ పయనిస్తోందని ఈ ప్రాంతాన్ని కనుక ఇది దాటగలిగితే ఇప్పటి వరకూ మానవ నిర్మిత వ్యోమనౌక సాధించిన రెండో ఘనత అవుతుందని నాసా వెల్లడించింది. ఇప్పటికే వోయేజర్-1 ఈ ఘనతను సాధించింది. రానున్న రోజుల్లో వాయేజర్-2 అందించే సౌర వ్యవస్థ ఆవలి నక్షత్ర మండలి వివరాలను మరింతగా తెలుసుకోగలుగుతామని, ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని ఈ ప్రాజెక్టు శాస్తవ్రేత్త ఎడ్‌స్టోన్ తెలిపారు. అయితే హెలియోస్పీయర్‌ను ఈ వ్యోమనౌక ఎప్పుడు సమీపిస్తుందన్నది కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు.