అంతర్జాతీయం

అంత తేలిక కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 7: రష్యా నుంచి క్షిపణులు కొనుగోలుకు భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా నీరుకార్చుస్తుందా? రష్యా నుంచి ఎస్ 400 ట్రింఫ్ మిసైళ్ల కొనుగోళ్లకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌తో భారత్ ఒప్పందం ఖరారు చేసింది. ఈ ఒప్పందం విలువ 5.4 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం పట్ల అమెరికా గుర్రుగా ఉంది. రష్యా నుంచి ఆయుధాలను భారత్‌కొనుగోళ్లు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల నుంచి మినహాయింపులను ఇచ్చే అధికారం ఉంది. కాని ఈ మినహాయింపులను భారత్‌కు ఇచ్చేందుకు అమెరికా ససేమిరా అనవచ్చని నిపుణులంటున్నారు. రష్యా, ఇరాన్, ఉత్తరకొరియాపై ఆర్థిక, రాజకీయపరమైన ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించే దేశాలపై ఆంక్షలను విధించే కాట్సా చట్టాన్ని ఆ దేశం రూపొందించింది. కాగా ఈ చట్టం ప్రయోగం నుంచి భారత్‌ను మినహాయించే అధికారం ట్రంప్ పరిపాలనకు అంది. కాని అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల్లో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలని నిపుణుల అంచనా. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్, విదేశాంగ శాక కార్యదర్శి మైక్ పొంపియో భారత్‌కు మేలు చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. న్యూ అమెరికా నిపుణుడు గోయల్ మాట్లాడుతూ రష్యా అంటే మండిపడే ట్రంప్ అంత సులభంగా భారత్ కొనుగోళ్లకు మినహాయింపు ఇస్తారని భావిస్తే పప్పులో కాలేసినట్లేనంటున్నారు. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన సంబంధాల నేపథ్యంలో భారత్ కొనుగోళ్లకు నో అని అమెరికా చెప్పదని అట్లాంటింక్ కౌన్సిల్ ప్రతినిధి భారత్ గోపాలస్వామి అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత అమెరికా భారత్ కొనుగోళ్లకు మినహాయింపుల నుంచి ఆంక్షలు విధించదని ఆయన చెప్పారు.