అంతర్జాతీయం

ఆయుధ నియంత్రణకు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 21: ‘అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాన్ని వారు ఉల్లంఘిస్తూ ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు, దీనిపై అభ్యంతరాలు చెబుతున్నా లక్ష్యపెట్టడం లేదు, ఇక మేమెందుకు ఇంకా దీనికి కట్టుబడి ఉండాలి? అందుకే మేము కూడా దీని నుంచి బయటకు వస్తున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా-రష్యా దేశాల మధ్య 1987లో జరిగిన ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్‌ఎఫ్) ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన శనివారం ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, యూరప్‌లోని మిత్రదేశాలు భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే 300 నుంచి 3400 మైళ్ల రేంజి క్రూయిజ్ మిస్సయిల్స్ తయారు చేయడం, కలిగి ఉండటం, ప్రయోగించడం నిషేధం. ‘మేము ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నాం.. ఎందుకంటే ఈ ఒప్పందాన్ని ఇప్పటికే రష్యా దేశం ఉల్లంఘిస్తోంది. ఇంకా దీనికి మేము కట్టుబడి ఉండటంలో అర్థం లేదు మేము కూడా ఇలాంటి ఆయుధాలను తయారు చేయగలం ’ అని ట్రంప్ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తమ జాతీయ రక్షణ సలహాదారు జాన్ బోల్టన్ సైతం ఈ ఒప్పందం నుంచి బయటకు రావాలని సూచించారని ఆయన చెప్పారు. అప్పట్లో ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ మధ్య 1987లో జరిగింది. మధ్యస్థాయి, స్వల్ప స్థాయి మిస్సయిల్స్ తయారీ, ఉపయోగాన్ని నిలిపివేయడానికి అప్పట్లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండగా, రష్యా మాత్రం గ్రౌండ్ మిస్సయిల్స్ తయారీని కొనసాగిస్తోంది. దీంతో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ జేమ్స్ మాట్టిస్ ఇటీవల నాటో మంత్రుల సమావేశంలో దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. రష్యా కనుక మిన్సయిల్స్ తయారీని ఆపకపోతే తాము సైతం ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండమని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఐఎన్‌ఎఫ్ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తూ వస్తోందని, అంతేకాకుండా రష్యా, చైనాల మధ్య ఇటీవల మిస్సయిల్స్‌కు సంబంధించి కొత్త ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు. దీంతో తాము సైతం ఐఎన్‌ఎఫ్ నుంచి వైదొలగుతున్నామని, కొత్త ఆయుధాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు. ఇతరులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు తామెందుకు దీనికి కట్టుబడి ఉండాలని ఆయన ప్రశ్నించారు.