అంతర్జాతీయం

ఉగ్రవాదుల చెర నుంచి జపాన్ జర్నలిస్టుకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 24: సిరియాలో మూడేళ్లక్రితం కిడ్నాప్‌కు గురైన ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్టు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించినట్లు జపాన్ పేర్కొంది. ఈ జర్నలిస్టు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి పేరు జంపమాయ్ యసుదా అని విదేశాంగ శాఖ మంత్రి టారో కొనో చెప్పారు. జపాన్‌కు చెందిన ఎంబసీ అధికారులు ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన జంపమాయ్ యసుదాను కలిసి యోగక్షేమాలను విచారించినట్లు ఆయన చెప్పారు. గత మంగళవారం ఈ వ్యక్తిని విడుదలయ్యారు. 2015లో యసుదాను ఆల్ ఖైదా గ్రూపు సంస్థకు చెందిన వ్యక్తులు అపహరించారు. కాగా యసుదా విడుదలకు సహకరించిన వారికి జపాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఉగ్రవాదులకు ఎటువంటి సొమ్ము చెల్లించలేదని జపాన్ పేర్కొంది. తన కుమారుడు సురక్షితంగా వస్తాడనే నమ్మకం తనకు ఉన్నట్లు జర్నలిస్టు యసుదా తల్లి సచికో యసుదా తెలిపారు. ప్రతి రోజు మూడేళ్లుగా తన కుమారుడి క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. యసుదా 2000 నుంచి మధ్యప్రాచ్యంలో విలేఖరిగా పనిచేస్తున్నారు. 2004లో ఒకసారి యసుదా ఇలాగే ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో బంధీ అయ్యారు. అనంతరం విడుదలయ్యారు.