అంతర్జాతీయం

ట్రంప్ ఫోన్ ట్యాపింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెల్‌ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందా? ఆయన చేసే సంభాషణలు ఇతరులు ఎవరైనా వింటున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ట్రంప్ తన ఐ పోన్ ద్వారా జరిపే సంభాషణలు చైనా, రష్యా దేశాలు దొంగచాటుగా వింటున్నాయని న్యూయార్కు టైమ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. వైట్‌హౌస్‌లోని ల్యాండ్ లైన్ వ్యవస్థ నుంచి కాక ట్రంప్ అంతగా భద్రత లేని ఐ ఫోన్ ద్వారా మిత్రులు, అధికారులు, ఇతరులతో చేసే సంభాషణలను ఈ రెండు దేశాలు చాటుగా ఆలకిస్తున్నాయని న్యూయార్కు టైం తన కథనంలో పేర్కొంది. దీనిపై ఇప్పటికే వైట్‌హౌస్ వర్గాల్లో చర్చ జరిగింది. సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడటం అంత భద్రత కాదని పలువురు అధికారులు ఇప్పటికే ట్రంప్‌ను హెచ్చరించారు. అయితే ఎలక్ట్రానిక్ భద్రత గురించి ఆయన అంతగా పట్టించుకోలేదని ఆయా వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన వేగులు తరచూ ఆయన సెల్‌ఫోన్ సంభాషణలను ఆలకిస్తున్నారని, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలవబోతున్నారు, విదేశీ ప్రతినిధులతో ఆయన జరిపే చర్చలేమిటి, ఆయనను ప్రభావం చేసే అంశాలేమిటి, వాణిజ్య, దౌత్యపరంగా ఆయన వ్యూహాలు ఏమిటి తదితర విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల అమెరికా, చైనా దేశాల మధ్య ఏర్పడిన ట్రేడ్ వార్ నేపథ్యంలో వారి నిఘా మరింత ఎక్కువైందని పేర్కొంటున్నారు. కాగా దీనిపై దృష్టి సారించిన అమెరికా నిఘా వర్గాలు ట్రంప్ సంభాషణల ద్వారా చైనా ఏమి తెలుసుకోవాలనుకుంటోంది అన్న అంశంపై దృష్టి సారించాయి. కాగా చైనాకు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం రష్యాకు లేదని, పైగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ దేశం ఇలాంటి చర్యకు పాల్పడి ఉండకపోవచ్చునని ఒక మాజీ అధికారి తెలిపినట్టు న్యూయార్కు టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ పత్రిక కథనాన్ని చైనా విదేశీ వ్యవహారా శాఖ ప్రతినిది హువా చున్‌యింగ్ స్పందిస్తూ అమెరికాలోని కొంతమంది వ్యక్తులు బెస్ట్‌స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డును కొట్టేయడానికి ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.