అంతర్జాతీయం

ప్రార్థనా స్థలంలో రక్తపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 28: ఒక శే్వతజాతీయుడు జరిపిన కాల్పుల్లో 11 మంది భక్తులు మృతి చెందిన సంఘటన అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శనివారం చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో యూదులపై జరిగిన దాడిలో అతి విషాదకరమైనదిగా దీనిని భావిస్తున్నారు. పిట్స్‌బర్గ్ పబ్లిక్ సేఫిటీ డైరెక్టర్ వెండెల్ హిస్‌రిచ్ కథనం ప్రకారం పిట్స్‌బర్గ్‌లోని స్వ్కెరెల్ హిల్‌లో యూదుల ప్రార్థనామందిరమైన ‘ట్రీ ఆఫ్ లైఫ్’లో శనివారం ఒక నామకరణ మహోత్సవం జరుగుతోంది. అక్కడికిరాబర్ట్ బోయర్స్ (46) అనే శే్వతజాతీయుడు రైఫిల్, మూడు హ్యాండ్ గన్లతో ప్రవేశించి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 11 మంది మృతి చెందగా నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను గాయపడగా, తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిలో పిల్లలెవరూ లేరని అధికారులు నిర్ధారించారు. బోయర్స్ యూదు జాతి విద్వేషి అని, ఆయన పలుసార్లు దీనిపై సోషల్ మీడియాలో తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇది విద్వేషపూరితమైన నేరమని, నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఎఫ్‌బిఐ పిట్స్‌బర్గ్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌చార్జి బాబ్ జోన్స్ తెలిపారు. దాడిలో అతడొక్కడే పాల్గొన్నట్టు భావిస్తున్నామని, మతపరమైన నమ్మకాలతోనే ఈ దాడికి పాల్పడినట్టు చెప్పారు. జరిగిన సంఘటనను యూదులపై వ్యతిరేక చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తికి మరణశిక్షే సరైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్య యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతులకు సంతాప సూచకంగా శే్వత సౌధం సహా, మిలటరీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జెండాలను ఈనెల 31 వరకు అవనతం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.