అంతర్జాతీయం

దోషులను దండించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 29: ముంబయి పటాన్‌కోట్ ఉగ్రదాడులకు పాల్పడ్డ వారిని తగిన విధంగా దండించాలని భారత్, జపాన్‌లు పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేశాయి. శిఖరాగ్ర భేటీలో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు ఉగ్రవాద కార్యకలాపాలను గర్హించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని ప్రతిఘటించాల్సిందేనని పిలుపునిచ్చారు. అలాగే ముంబయి పటాన్‌కోట్ దాడిలో పాల్గొన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పాక్‌ను ముక్తకంఠంతో కోరారు. శిఖరాగ్ర భేటీ అనంతరం విడుదల చేసిన విజన్ పత్రంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌సజి)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు పలికింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితిని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరించాలని భారత్ ప్రధాని మోదీతో కలిసి జపాన్ ప్రధాని పిలుపునిచ్చారు.