అంతర్జాతీయం

కొలువుదీరిన రాజపక్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 29: ఓ పక్క దేశ ప్రధానిగా తన నియామక వ్యవహారం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏ క్షణంలోనైనా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. లంక పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. రాజ్యాంగ ప్రక్రియను పాటించాలని, ప్రజాస్వామ్య విలువలతోనే ఈ సంక్షోభాన్ని గట్టెక్కాలని ఐరాస పిలుపునిచ్చింది. వెంటనే పార్లమెంట్‌ను సమావేశ పరచాలని లంక అధ్యక్షుడు సిరిసేనకు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, తన గార్డు కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించిన ఘటనపై శ్రీలంక పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగను అరెస్టు చేశారు.