అంతర్జాతీయం

ఇరాన్‌కు కష్టకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: ఇరాన్‌కు కష్టకాలం ప్రారంభమైంది. న్యూక్లియర్ ఒప్పందం నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే భారత్, చైనా, జపాన్ సహా ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షలు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపులకు కారణం ఈ దేశాలు ఇరాన్‌నుంచి తమ చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడమేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, అదేవిధంగా భారత్ సహా పలు దేశాలకు వీటి అమలు నుంచి మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించారు.
ఆంక్షల వల్ల యూరప్, ఆసియాతో ఇతర దేశాలు ఇక నుంచి ఇరాన్ చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకోరాదు. 2015లో ఇరాన్‌తో చేసుకున్న న్యూక్లియర్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష, సైబర్‌దాడులు, ఉగ్రవాద గ్రూపులకు సహకారం వంటి చర్యలకు ఇరాన్ స్వస్తి పలకాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేసే భారత్, చైనా దేశాలు కూడా ఆ దేశం నుంచి దిగుమతులు నిలిపివేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశ ఆర్థికరంగం, చమురు రంగాల నిర్వీర్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. అయితే సోమవారం నుంచి ఇరాన్‌పై ఆంక్షలు ప్రారంభమైన నేపథ్యంలో
చైనా, భారత్ దేశాలు మిగిలిన దేశాల్లా కాకుండా తమపై ఆంక్షలు సడలించాలని కోరగా, ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను సాధ్యమైనంత త్వరగా జీరోస్థాయికి తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం ఈ రెండు దేశాలు సహా టర్కీ, ఇరాక్, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా దేశాలకు మినహాయింపు ఇస్తూ సూచించింది. అయితే అమెరికా ఆంక్షలను ఏ దేశాలు తిరస్కరించాయో వెల్లడించడానికి నిరాకరించిన అమెరికా సెక్రటరీ మైక్ పాంపియో, కొన్ని దేశాలు మాత్రం దిగుమతుల మొత్తాన్ని జీరో చేసేవరకు కొంతసమయం ఇవ్వమని కోరినట్టు చెప్పారు.
అయితే అమెరికా పౌరులు చమురుకు ఎలాంటి ఇబ్బందులు పడనవసరం లేదని స్పష్టం చేశారు. సోమవారం నుంచి తాము విధించిన ఆంక్షలు కేవలం క్రూడాయిల్‌కు మాత్రమే సంబంధించినవి కావని, ఆర్థికపరమైన వాటిపై కూడా ఇవి అమలవుతాయని ఆయన చెప్పారు. దీంతో ఇరాన్‌లోని ట్రెజరీ శాఖ సహా 600 కంపెనీలపై దీని ప్రభావం పడుతుందని అన్నారు.
చైనా తర్వాత ఇరాన్ నుంచి అధిక మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ ప్రతి సంవత్సరం తాను దిగుమతి చేసుకునే 22.6 మిలియన్ టన్నులు (రోజుకు 45200 బేరళ్లు) నుంచి రోజుకు 1.25 మిలియన్ టన్నులు లేక సంవత్సరానికి 15 మిలియన్ టన్నులు (రోజుకు 300000 బేరళ్లు)కు తన దిగుమతులను పరిమితం చేసుకోవడానికి అంగీకరించినట్టు ఆయన చెప్పారు. కాగా, అమెరికా విధించిన ఆంక్షలను భారత్ లెక్కచేయకుండా ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉంటే మీరేం చేస్తారు అని పీటీఐ అడిగిన ప్రశ్నకు వారు స్పందించలేదు.

చిత్రం..అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని