అంతర్జాతీయం

వజ్రాన్ని మింగేసింది.. దొరికిపోయంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 5: ఆసియా ఖండానికి చెందిన దంపతులు దుబాయ్‌లోని ఓ దుకాణంలో విలువైన వజ్రాన్ని అపహరించి దేశం విడిచి పారిపోతుండగా అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పోలీసులకు భారత్‌లో పట్టుబడ్డారు. నాటకీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామాల్లో చోరీకి గురైన వజ్రం విలువ 300,00 దిర్హామ్‌లు ( 81వేల అమెరికన్ డాలర్లు). సుమారు 40 సంవత్సరాల వయసుగల ఈ అనుమానిత దంపుతులు 3.27 క్యారట్ల వజ్రాన్ని తస్కరించిన తర్వాత ఆ దంపతుల్లోని మహిళ వజ్రాన్ని మింగేసింది. తర్వాత ముంబయి మీదుగా హాంగ్‌కాంగ్ పారిపోయేందుకు పథకం వేశారు. అయితే ఇంటర్‌పోల్, భారతీయ పోలీసుల సహకారం తీసుకున్న అరబ్ ఎమిరేట్స్ పోలీసులు నిందితులను ముంబయిలో పట్టుకుని తిరిగి వారి దేశానికి తీసుకువెళ్లారు. కాగా దుబాయ్‌లోని దైరాస్ గోల్డ్ సౌక్‌లోని జ్యువెలరీ స్టోర్‌లోకి ఈ దంపుతులు ప్రవేశించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డుకాగా, ఆ వీడియోను పోలీసులు పత్రికలకు విడుదల చేశారని ఖలీజ్ టైమ్స్ పత్రిక పేర్కొంది. నగల దుకాణంలోకి ప్రవేశించిన దంపతుల్లో మగవ్యక్తి అక్కడి సిబ్బందిని మాటల్లోకిదించి దృష్టి మరల్చగా మహిళ నేరుగా ప్రవేశ ద్వారం వద్దగల ఓ గ్లాస్‌డోర్‌ను తెరిచి అందులోని వజ్రాన్ని తస్కరించి తను ధరించిన జాకెట్‌లో దాచుకుని తర్వాత తన భర్తతో కలిసి వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. కాగా చోరీ జరిగిన మూడు గంటల తర్వాత తెలుసుకున్న దుకాణ యజమాని తమ దృష్టికి తెచ్చారని నేర పరిశోధనా శాఖ డైరెక్టర్ కల్నల్ ఆదెల్ అల్ జోకర్ తెలిపారు. వజ్రం మహిళ కడుపులో వున్నట్లు తేలడంతో దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక డాక్టర్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.