అంతర్జాతీయం

బరిలో ఇండో-అమెరికన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 5: వివాదాస్పద వలస విధానాలతో సంచలనం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడికి ఆయన నిర్ణయాలు ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయా? లేక ఆయన పాలనా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో 12మంది వరకు ఇండియన్ అమెరికన్లు పోటీలో ఉన్నారు. ట్రంప్ వలస విధాన నిర్ణయాలు ఈ ఎన్నికల్లో వారి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇండో అమెరికన్ యువత ఓట్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిని మరోవర్గం కొట్టివేసింది. 32.57 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఈ వలసవాదుల సంఖ్య చాలా అల్పమని, ఒక్క శాతం మాత్రమే ఉన్న వీరు ఎన్నికల్లో ప్రభావం చూపుతారనడం సబబు కాదని యూఎస్ మాజీ అంబాసిడర్ రిచ్‌వర్మ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు మార్పునకు ఉద్దేశించినవని, ముఖ్యంగా రెండు సభలకు కొత్త అభ్యర్థులను పంపాలని ఓటర్లు భావిస్తున్నారని చెప్పారు. కాగా, ప్రస్తుత సభలో ప్రతినిధులుగా ఉన్న నలుగురు ఇండో అమెరికన్లు ఈ ఎన్నికల్లో సులభంగా గట్టెక్కుతారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు పోటీలో ఉన్న మరో ఏడుగురు ఇండో అమెరికన్ల గెలుపుపై ఆసక్తి నెలకొంది.