అంతర్జాతీయం

ఎవరిది పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకాన్ (యూఎస్), నవంబర్ 5: అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలపై ఇటు అధికార రిపబ్లికన్లు, అటు విపక్ష డెమోక్రాట్లు నువ్వా, నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. మంగళవారం జరిగే ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు సంవత్సరాల పాలనకు రిఫరెండంగా అభివర్ణిస్తున్నారు. గత 48 గంటల నుంచి ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఎడతెరపిలేకుండా ప్రచారంలో మునిగిపోయారు. న్యూ వాషింగ్టన్ పోస్టు, ఏబీసీ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం డెమోక్రాట్లు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యం సాధించవచ్చునని పేర్కొన్నాయి. దేశ ఆర్థిక విధానాలు, ఇటీవల ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు, సరిహద్దు భద్రతపై ట్రంప్ వైఖరి ఓటర్లపై ప్రభావం చూపుతాయని, వారు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉండవచ్చునని పేర్కొన్నాయి. అలాగే వాల్‌స్ట్రీట్ జర్నల్, ఎన్‌బిసి నిర్వహించిన మరో సర్వేలో డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నాయి. విద్యావంతులైన మహిళలు, సబ్‌అర్బన్ ప్రాంతానికి చెందిన స్ర్తిల ఓట్లు కీలకమని, వీరు డెమోక్రాట్లపై మొగ్గు చూపిస్తున్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఇటీవల దేశంలో జరిగిన పరిణామాలు సైతం ఓటర్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల పీట్సబర్గ్‌లో ఒక ఉన్మాది 11 మందిని కాల్చి చంపడం, విపక్ష నాయకుడు ఒబామా సహా విపక్షాలకు చెందిన పలువురు నాయకులకు పైపు బాంబులు పార్సిళ్లలో పంపిన కేసులో ట్రంప్ మద్దతుదారుడు ఒకరు అరెస్టు కావడం వంటి అంశాలు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు డజన్ల సంఖ్యలోని గవర్నర్ స్థానాలకు సైతం పోటీపడుతున్నాయి. ముఖ్యంగా జార్జియా, ఫ్లోరిడా స్థానాలను కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. మొదటిసారి ఇద్దరు ఆఫ్రికన్-అమెరికన్లను ఇక్కడ పోటీలో నిలబెట్టిన డెమోట్రాట్లు ఇక్కడ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు.