అంతర్జాతీయం

భారత్ ప్రగతి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిలాంగ్వే, నవంబర్ 5: భారత దేశపుఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా సాగుతోందని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం కితాబినిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆరు రోజుల నుంచి ఆఫ్రికాలోని మూడు దేశాల్లో పర్యటిస్తున్న ఆయన చివరి రోజైన ఆదివారం నాడు మాలవీ చేరుకుని ఇక్కడి భారతీయులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోట్స్‌వానా, జింబాబ్వే, మాలవీ దేశాలతో భారత్ వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కృషిచేస్తోందని నాయుడు తెలిపారు. భారత్ ప్రగతివైపు సాగుతోందని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం ఈ విషయంలో ప్రశంసలు కురిపిస్తున్నాయని అన్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)ని విజయవంతంగా అమలు చేయడం దేశానికి ఓ శుభపరిణామని ఆయన తెలిపారు. కేవలం అక్టోబర్ మాసంలోనే జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల మించి రికార్డు స్థాయిలో జరిగాయన్నారు. దేశమంతటా ఒకే శ్లాబ్, ఒకే పన్ను ప్రభుత్వ లక్ష్యమన్నారు. అతివేగంగా అభివృద్థిచెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ 2025 నాటికి అతిశక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉద్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యంలో భారత్ ప్రపంచ దేశాల ర్యాంకింగ్‌లో 77వ స్థానానికి చేరుకున్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీఎస్టీ వంటి బహుళ ప్రయోజనాలు గల నిర్ణయాలు అమలు వల్లే ఇది సాధ్యమైందని నాయుడు చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లను సైతం ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.
దేశ ఆర్థిక ప్రగతిలో మీరూ భాగస్వాములవుతున్నందుకు ఆనందంగా ఉందని అక్కడి భారతీయులనుద్దేశించి ఆయన అన్నారు. వృత్తుల్లో అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్న మీరు ఆదర్శప్రాయులని నాయుడు ప్రశంసించారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా శాంతి కాముకులుగా గుర్తింపుపొంది అక్కడివారితో కలిసిపోతుండటం హర్షణీయమన్నారు. అంతకు ముందు మాలవీ చేరుకున్న వెంకయ్య నాయుడుకు లిలాంగ్వే విమానాశ్రయంలో మాలవీ విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి డాక్టర్ ఎమ్మాన్యుయేల్ ఫాబియన్, విద్యాశాఖ మంత్రి బ్రైట్ మ్సాకా, భారత రాయభారి సురేష్ కుమార్ మీనన్‌లు ఘన స్వాగతం పలికారు. కాగా మాలవీలో సుమారు 8,500 మంది భారతీయ మూలాలున్నవారు జీస్తున్నట్లు ఇక్కడి రాయభార కార్యలయం తెలిపింది.