అంతర్జాతీయం

కాలుష్యంతో పిల్లల్లో ఆటిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 6: ఆరుబయట కాలుష్యం అనగా వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చైనాలో జరిపిన ఒక పరిశోధన వెల్లడించింది. ఈ కాలుష్యం వల్ల పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌డి) 78 శాతం అధికమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఆడుకోకపోవడం, ఇతరులతో కలవకపోవడానే్న ఏఎస్‌డిగా వ్యవహరిస్తారు. షాంగైలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులపై 124 మంది ఏఎస్‌డి పిల్లలు, 1,240 మంది ఆరోగ్యవంతమైన పిల్లలపై వివిధ స్టేజిల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా పరిశోధనలు జరిపారు. ఈ మేరకు ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్‌లో దీనికి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. ముఖ్యంగా గాలి కాలుష్యం చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్టు గుర్తించారు. ప్రసూతికి ముందే కాలుష్యం ప్రభావంపై గతంలో పరిశోధనలు జరిగాయి. దీనిలో ఆటిజం వ్యాధి రావడానికి గల కారణాలను పూర్తిగా నిర్ధారించలేక పోయారు. అయితే ఇప్పుడు జరిపిన పరిశోధనల వల్ల ఈ వ్యాధికి జన్యుసంబంధ, శరీర సంబంధ లక్షణాలతో పాటు పర్యావరణ పరమైన కారణాలు కూడా కారణమని తేల్చినట్టు చైనీస్ అకాడమీ ఆప్ సైనె్సస్‌కు చెందిన జీలింగ్ గుయో తెలిపారు.