అంతర్జాతీయం

లంకలో కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 6: పార్లమెంటుకు బలపరీక్ష త్వరలో జరగనున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బతగిలింది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ ప్రభుత్వంలో ఒక సహాయ మంత్రి పదవీ చ్యుతుడైన ప్రధాని రాణిల్ విక్రమసింఘేకు మద్దతుగా రాజీనామా చేశారు. దీంతో రానున్న రోజుల్లో శ్రీలంకలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. గత నెల 26వ తేదీన ప్రధాని విక్రమ సింఘేను ప్రధానమంత్రి పదవి నుంచి అధ్యక్షుడు తొలగించారు. ఆయన స్థానంలో మహీంద్ర రాజపక్సేను నియమించారు. నవంబర్ 16వ తేదీ వరకు పార్లమెంటరీ సమావేశాలను రద్దు చేశారు. సహాయ మంత్రి నానాయక్కర రాజీనామాచేయడంతో అధ్యక్షుడు సిరిసేన వర్గం ఖంగు తింది. సిరిసేన, రాజపక్సే జాబితాలో 96 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే విక్రమ సింఘే ప్రధానమంత్రి అని, పార్లమెంట్ స్పీకర్ కరూ జయసూర్య గుర్తించారని రాజీనామా చేసిన మంత్రి నానాయక్కర పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీనే మంత్రిగా ప్రమాణం స్వీకరించి ఐదారు రోజుల్లోనే రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో తాను చురుకుగా పాల్గొంటానని చెప్పారు. తమకు 225 సభ్యులు ఉన్న పార్లమెంటులో 113 మంది మద్దతు ఉందని అధ్యక్షుడు సిరిసేన వర్గం పేర్కొంది. రాజకీయ సంక్షోభం నెలకొన్న తర్వాత పార్లమెంటు సభ్యుల కోసం బేరసారాలు జోరుగా సాగుతన్నాయి. ఒక్కో ఎంపీని ఐదు వందల మిలియన్ల వరకు ఆఫర్ చేస్తున్నారు.కాగా దేశాధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదని, రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని స్పీకర్ కరూ జయసూర్య తెలిపారు. పార్లమెంటులో బలపరీక్ష జరిగి గెలిచిన తర్వాత కాని రాజపక్సే ప్రభుత్వాన్ని గుర్తించనని స్పీకర్ ప్రకటించారు. పార్లమెంటును వీలైనంత త్వరలో సమావేశపరిచి బలపరీక్షకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ అధ్యక్షుడిని కోరారు. కాగా అమెరికా, కామన్ వెల్త్ దేశాలు వీలైనంత త్వరలో పార్లమెంటును సమావేశపరిచి బలపరీక్షను నిర్వహించాలని శ్రీలంక అధ్యక్షుడిని కోరాయి.