అంతర్జాతీయం

డెమాక్రాట్లతో కలిసి పని చేసేందుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తమకు ఘన విజయం లభించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ప్రతిపక్ష డెమాక్రాట్లు హౌస్ ఆఫ్ రిప్రంజంటేటివ్స్‌లో తమకు అధిపత్యం లభించినట్లు పేర్కొన్నాయి. ఈ సభలో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండేది. కాగా సెనెట్‌లో మాత్రం రిపబ్లికన్లకే మెజార్టీ ఉంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ సుడిగాలిలా పర్యటనలు జరిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ట్రంప్ ప్రకటన చేస్తూ డెమాక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేద్దామని ఆహ్వానించారు. దేశంలో వౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, వాంజ్యం, ఔషధాల రేట్లను తగ్గించడం లాంటి బృహత్తర పనులపై అందరం కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రతిపాదించారు. గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా హౌస్ ఆఫ్ రిప్రంజంటేటీవ్స్ సభలోమెజార్టీ కోల్పోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే ట్రంప్ పాజిటివ్‌గా ప్రకటన చేశారు. హౌస్ ఆఫ్ రిప్రంజంటేటివ్స్‌లో 435 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ డెమాక్రాట్లకు ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాగా వంద సభ్యుల సెనెట్‌లో రిపబ్లికన్లకే మెజార్టీ సీట్లు ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్, పన్నులు, ఆరోగ్య రంగంలో సంస్కరణలపై విప్లవాత్మకమైన శాసనాలను తేవాలని ట్రంప్ భావిస్తున్నారు. తాజా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ట్రంప్ దూకుడుకు కళ్లెం వేసే యోచనలో డెమాక్రాట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు చెందిన 28 సీట్లలో డెమాక్రట్లు గెలిచారు. కొత్తగా ఏర్పడిన హౌస్ ఆఫ్ రిప్రంజంటేటివ్స్ సమావేశాలు జనవరిలో ప్రారంభమవుతాయి. సెనెట్‌లో 51 సీట్లు రిపబ్లికన్లకు, 49 సీట్లు డెమాక్రట్లకు ఉన్నాయి. హౌస్‌కు జరిగిన ఎన్నికల్లో డెమాక్రట్ పార్టీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఎన్నికయ్యారు. ఈ పార్టీకి చెందిన 28 మంది మహిళలు గెలిచారు. రషీదా త్లాయిబ్ అనే ముస్లిం మహిళ తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇంకా సోమాలి అమెరికన్ లిహాన్ ఒమర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిచేందుకు 60 రోజుల్లో 30 ర్యాలీల్లో ట్రంప్ ప్రసంగించారు. మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా ప్రజలు నమ్మలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఒబామా హయాంలో కూడా డెమాక్రట్లు 2010లో హౌస్‌లో 63 సీట్లు కోల్పోయారని, ఆరు సెనెట్ సీట్లలో ఓటమి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. తన విధానాలను వ్యతిరేకించి రిపబ్లికన్లు ఓడిపోయారన్నారు. కాగా తాజా ఎన్నికల్లో గెలిచిన డెమాక్రట్లు ట్రంప్‌పై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇటువంటి డిమాండ్లను ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసని, సెనెట్‌లో తమకే మెజారిటీ ఉందని ట్రంప్ పేర్కొన్నారు.