అంతర్జాతీయం

గాంధీజీ పయనించిన బాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీటర్‌మారిట్జ్‌బర్గ్, జూలై 9: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డర్బన్ వరకు రైల్లో ప్రయాణించారు. పెట్రిచ్ స్టేషన్‌నుంచి నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్ వరకు ఆయన రైల్లో ప్రయాణించారు. నాడు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో జాతివివక్ష కారణంగా రైల్లోనుంచి బైటికి తోసేయబడిన సంఘటనకు గుర్తుగా మోదీ శనివారం అదే మార్గంలో ప్రయాణం చేశారు. పలువురు దక్షిణాఫ్రికా అధికారులతో కలిసి ఆయన రైల్లో ప్రయాణం చేశారు. 1893 జూన్ 7వ తేదీ రాత్రి పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో మొదటి తరగతి బోగీలో ప్రయాణిస్తున్న గాంధీజీని నల్లజాతి వాడన్న కారణంగా రైల్లోంచి బలవంతంగా బైటికి తోసేసిన విషయం తెలిసిందే. మోహన్‌దాస్ (కరమ్‌చంద్ గాంధీ) మహాత్మాగాంధీగా మారడానికి బీజం పడిన చోటు ఇది’ అని పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ మోదీ అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటన తనకు ఓ పవిత్ర యాత్రలాంటిదని, ఎందుకంటే భారతదేశ చరిత్రతో, జాతిపిత మహాత్మాగాంధీ జీవితంతో ముడిపడిన స్థలాలను తాను సందర్శిస్తున్నానని ఆయన అన్నారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన చోటును సైతం ఆయన చూశారు. అనంతరం రైల్వే స్టేషన్‌లో ఉంచిన సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తూ పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌లో జరిగిన సంఘటన భారత దేశ చరిత్ర గతినే మార్చివేసిందని పేర్కొన్నారు. రైల్లోంచి గెంటివేయబడిన తర్వాత గాంధీజీ ఆ రోజు రాత్రంతా గడిపిన రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాలులో ఒక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

చిత్రం.. పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన చోట ఉంచిన స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ