అంతర్జాతీయం

మాతృమూలాలు మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 10: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూంటే భారత్ మాత్రం అభివృద్ధి పథంలో ఆశాజనకంగా పరుగులు పెడుతోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఇక్కడి భారతీయ సంతతినుద్దేశించి మాట్లాడిన ఆయన మాతృదేశంలో వెల్లువెత్తుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే భారత్‌లో పురివిప్పుతున్న కొత్త ఆవిష్కరణల్లో కూడా పాలుపంచుకోవాలన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు శతవార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు యునెస్కోలో మాట్లాడారు. భారతీయులు ఎక్కడ ఉన్నా తమ మూలాలను విస్మరించుకూడదని, మాతృదేశంలో సాగుతున్న అభివృద్ధి ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని అన్నారు. భారత ప్రభుత్వం చేపడుతున్న సాహసోపేత సంస్కరణల వల్ల దేశ అభివృద్ధి స్వరూపమే మారిపోతోందని, ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. ముఖ్యంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల జాతీయ మార్కెట్ మరింత పాదర్శకంగా, శక్తివంతంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తరించాయని, వాటి విస్తరణకూ మార్గం మరింతగా సుగమమైందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో భారతీయ సంతతివారందరూ తమ వంతు బాధ్యతను నెరవేర్చాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఫ్రాన్స్ దేశ శాస్త్ర, సాంకేతిక రంగం, వ్యవసాయం, పరిశ్రమలు, కళలు, సాంస్కృతిక వికాసంలోనే కాకుండా పాలన, రాజకీయాల్లో కూడా ప్రవాస భారతీయులు నిరుపమానమైన రీతిలో సేవలందించారని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా ప్రశంసించారు. వీరి కృషి పట్టుదల ఫ్రాన్స్‌కు ఎంత గర్వకారణమో మాతృదేశానికీ అంతే ఆనందదాయకమన్నారు. ఫ్రాన్స్ ప్రజా జీవితంలో భారతీయ సంతతి, ప్రవాస భారతీయులు నిరుపమానమైన రీతిలో తమ ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. ఫ్రాన్స్ పార్లమెంట్, ఐరోపా పార్లమెంట్‌లో కూడా వీరు సభ్యులు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. భారత్-ఫ్రాన్స్ బంధం చాలా బలమైనదని పేర్కొంటూ రవీంద్రనాథ్ టాగూర్ మేధో ప్రభావం అనేక మంది ఫ్రాన్స్ మేధావులను కదిలించిందని గుర్తు చేశారు. జెఆర్‌డి టాటా సహా అనేక మంది భారతీయ ప్రముఖులకు ఫ్రాన్స్‌తో బలమైన అనుబంధం ఉందన్నారు.

చిత్రం..పారిస్‌లో భారతీయ సంతతి ప్రజలతో రాష్ట్రపతి వెంకయ్యనాయుడు