అంతర్జాతీయం

మరింతగా మైత్రీ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హన్వయి, నవంబర్ 19: గత రెండు దశాబ్దాల కాలంలో వియత్నాం సాగించిన ప్రగతి అద్భుతం, నిరుపమానమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భారత్, వియత్నాం మధ్య వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో మరింతగా సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు.
సోమవారం నాడిక్కడ జరిగిన ఇండో-వియత్నాం బిజినెస్ ఫోరంలో మాట్లాడిన కోవింద్ భారత్, వియత్నాంలు అత్యంత అత్యంత ప్రాచీనమైన నాగరికతను కలిగి ఉన్నాయని, వీటిమధ్య సాంస్కృతికంగాను, ఆధ్యాత్మికంగాను లోతైన సంబంధాలు ఉన్నాయన్నారు. అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాలు సాగేయనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయన్నారు.
గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ సంబంధాలు మరింత విస్తరించాయని, ద్వైపాక్షిక వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు. రెండు దేశాలు, చాలా బలంగా అభివృద్ధి పథంలో సాగుతున్నందున వీటి మధ్య వాణిజ్యం మరింత వేగాన్ని పుంజుకునే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో ఐటీ, డిజిటల్, ఆర్థిక వ్యవస్థ, రక్షణ, హైడ్రోకార్బన్‌లు, హెల్త్‌కేర్, టూరిజం రంగాల్లో విశేషమైన రీతిలో పెట్టుబడులకు అవకాశాలున్నాయని కోవింద్ స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా, క్లీన్ ఇండియా తదితర భారత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని వియత్నాంకు ఆయన పిలుపునిచ్చారు.

చిత్రం..వియత్నాంలో యునెస్కో గుర్తించిన ‘మైసన్’ అనే వారసత్వ కేంద్రం వద్ద సోమవారం ఓ మొక్కను నాటుతున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్