అంతర్జాతీయం

ముంచుకొస్తున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 20: మానవుని మనుగడకు వాతావరణ మార్పులు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులతో రానురాను వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వాతావరణ మార్పుల గురించి ఓ పత్రికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు ప్రచురితమయ్యాయి. మనుషులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందీ ధృవీకరించే అధ్యయన పత్రాలు జర్నల్‌లో ముద్రించారు. ఆరోగ్యం, ఆహారం, నీళ్లు, ఆర్థిక, వౌలిక వసతులు, భద్రతపై వాతావరణ మార్పులు ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరించారు. భూతాపం, కరవుకాటకాలు, వేడి గాలులు, అటవుల దహనం, వర్షపాతం, వరదలు, తుఫానులు, సముద్ర మట్టం పెరిగిపోవడం వంటివి సంభవిస్తాయని అమెరికాలోని హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకులు స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలకు సంబంధించి, అలాగే విడివిడిగానూ అధ్యయనం చేసినట్టు వారు తెలిపారు. వాతావరణ మార్పుల ముప్పు గతంలోనూ ఉన్నప్పటికీ తాజా పరిశోధనలో మరింత ప్రమాదకర స్థాయికి పెరిగిపోయినట్టు వెల్లడైందని హవాయి వర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ కమీలో మోరా వెల్లడించారు.