అంతర్జాతీయం

రక్షణ బంధానికి బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, నవంబర్ 20: రక్షణ, చమురు, సహజవాయువు రంగాల్లో భారత్-వియత్నాం దేశాలు పరస్పర సహకారంతో ముందడుగువేయాలని, ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటనలో భాగంగా వియత్నాంకు వ్చారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం అధ్యక్షుడు గుయాన్ ఫూట్రాంగ్‌తో చర్చలు జరిపారు. అంతకుముందు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆగ్నేయాసియా దేశాల్లో తొలిసారిగా రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు అభివృద్ధికి దోహదపడే అనేక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు అధికార ప్రకటన వెలువడింది. ఈ చర్చలు ఎంతో సంతృప్తినిచ్చాయని రాష్టప్రతి కోవింద్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఇరుదేశాధినేతలు ఆకాంక్షించారు. ఈ దిశగా ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, చమురు, సహజవాయువు, వౌలిక సదుపాయాలు, ఐటి రంగం, వ్యవసాయం, సృజనాత్మక రంగాల్లో ఇరుదేశాలు సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాలు కమ్యూనికేషన్లు, విద్య, వాణిజ్యపెట్టుబడి సంబంధాలపై మూడు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వియత్నాం సైనికులకు శిక్షణ ఇచ్చే విషయమై అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
వియత్నాం సరిహద్దు గార్డులకు నౌకారంగంలో అవసరమైన ఆధునిక ఓడలను సమకూర్చేందు 100 మిలియన్ డాలర్ల పరపతి సదుపాయాన్ని కల్పించేందుకు భారత్ అంగీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని, సముద్ర జలాల పరిరక్షణపై పరస్పరం భద్రతపై సహకరించుకోవాలని, ఆర్థికావకాశాలను మెరుగుపరుచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

చిత్రం..వియత్నాం ప్రధానమంత్రితో భారత రాష్ట్రపతి కోవింద్ కరచాలనం