అంతర్జాతీయం

సింథియా మృతిపై కాంగోలో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిన్షాసా, జూలై 9: హైదరాబాద్‌లో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో మహిళ సింథియా వెచెల్ ఉదంతం కాంగోలోని ఆమె స్వస్థలమైన కిన్షాసాలో స్థానికులు అక్కడి భారతీయ వ్యాపారులపై ప్రతీకార దాడులకు దిగడానికి కారణమైంది.
బుధవారం హైదరాబాద్‌లో కాంగో మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేసినట్లు వార్తలు శుక్రవారం స్థానిక దినపత్రికల్లో రావడంతోనే దేశ రాజధాని కిన్షాసాలోని నిరుపేదలు నివసించే గబా ప్రాంతంలో స్థానికులు ఆగ్రహంతో స్థానికంగా వ్యాపారాలు చేసుకునే భారతీయులపై రాళ్లు రువ్వడంతోపాటు దాడులకు దిగారు. దీంతో భారతీయ వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఇళ్లలోంచి బైటికి రాలేదు. శనివారం కూడా వారు తమ షాపులను తెరవలేదు. చాలా ఆఫ్రికా దేశాల్లోలాగానే కాంగోలో కూడా రిటైల్ రంగంలో ముఖ్యంగా బట్టలు, కాస్మొటిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాల్లో భారతీయ సంతతికి చెందినవారే ఉన్నారు. గత మేలో కూడా న్యూఢిల్లీలో ఒక కాంగో యువతిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేసినప్పుడు సైతం భారత వ్యతిరేక ప్రదర్శనలు పెల్లుబికాయి. దీంతో అధికారులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగానే ఉందని భారతీయ దుకాణంలో పనిచేసే బ్లాన్‌చంద్ మవాడీ అనే అతను అన్నాడు. ప్రధాని ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ సంఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.