అంతర్జాతీయం

బ్యాంకులకు వందశాతం రుణాలు చెల్లిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 5: భారత్‌లోని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లిస్తానని, తాను ఎగవేతదారుడిని కానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు పరారైన భారత్ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అనేక బ్యాంకులకు బకాయి పడ్డానని, వీటిని నూటిని నూరుశాతం తీర్చివేస్తానని, బ్యాంకులు అంగీకరించాలన్నారు. 62 ఏళ్ల విజయ్ మాల్యా 2016లో భారత్ నుంచి పరారైన విషయం విదితమే. బ్యాంకులకు రూ.9వేల కోట్ల సొమ్ము బకాయి ఉన్నారు. కాగా విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు ఈ నెల 10వ తేదీన తీర్పు ఇవ్వనుంది. కోర్టులో తన అప్పగింత విషయమై విచారణ జరుగుతోందని, చట్టం తన పనితాను చేసుకుని పోతుందన్నారు. తాను చేసిన ప్రతిపాదనను బ్యాంకులు, ప్రభుత్వం అంగీకరించాలన్నారు. తాను 2016లోనే సెటిల్‌మెంట్ ఆఫర్ చేశానన్నారు. తాను అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కాపాడేందుకు ఈ రుణాలు చేశాన్నారు. విమానయాన సంస్థ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల నష్టాలను చవిచూసిందన్నారు. నేను తీసుకున్న రుణంలో అసలు మొత్తాన్ని వంద శాతం చెల్లిస్తానని ఆఫర్ చేసినట్లు చెప్పారు. తాను మద్యం కంపెనీలను నడిపానని, కోట్లాది రూపాయలను ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించామన్నారు. కింగ్ ఫిషర్ విమాన సంస్థ పెద్ద ఎత్తున పన్నులు చెల్లించిందన్నారు. రాజకీయనాయకులు, మీడియా నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఆగస్టావెస్ట్‌లాండ్ కేసులో దళారి మైఖేల్ క్రిస్టియన్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకువచ్చిన కొద్ది సేపట్లోనే మాల్యా బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని ట్వీట్‌లు చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బ్రిటన్ కోర్టులో మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమ వ్యాజ్యం జరుగుతోందని. భారత్ తరఫున యూ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసస్ వాదనలు చేస్తోంది.