అంతర్జాతీయం

పాక్ వ్యతిరేకి బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 7: భారత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ముస్లిం వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. వచ్చే సంవత్సరం భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభమవుతాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2008లో ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడి సూత్రధారులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలనే పట్టుదలతో తమ ప్రభుత్వం ఉందని, పాకిస్తాన్ ప్రయోజనాల కోసమే తాము ఈ పని చేయదలిచామని ఆయన అన్నారు. ‘్భరత్‌లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడి అధికార పార్టీ ముస్లిం వ్యతిరేక, పాకిస్తాన్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంది. నా విజ్ఞప్తులన్నిటినీ వారు తిరస్కరించారు. అక్కడ ఎన్నికలు ముగిసిన తరువాత మేము భారత్‌తో తిరిగి చర్చ లు ప్రారంభించగలమన్న విశ్వాసం ఉంది’ అని ఇమ్రాన్ ఖాన్ గురువారం ‘ద వాషింగ్టన్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగజాలవని భారత్ పాకిస్తాన్‌కు గట్టిగా చెప్పింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకుండా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పారు. ముంబయిఫై ఉగ్రవాద దాడి గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఈ దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందన్నారు. ఈ దాడి ఉగ్రవాద చర్య. అందువల్ల ఈ కేసును పరిష్కరించడం పాకిస్తాన్‌కు ప్రయోజనకరం’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన పది మంది లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబయికి చేరుకొని, విచక్షణారహితంగా కాల్పులు జరపడం ద్వారా 166 మందిని బలిగొన్నారు. వీరిలో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత పోలీసులు కాల్చి చంపగా, సజీవంగా పట్టుబడిన మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను తరువాత కోర్టు విధించిన మరణశిక్ష మేరకు ఉరి తీశారు.