అంతర్జాతీయం

పారిస్ ఒప్పందంపై నా వైఖరి సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాతావరణ మార్పును నిరోధించడానికి కుదిరిన పారిస్ ఒప్పందాన్ని తప్పుబట్టారు. పారిస్ ఒప్పందాన్ని తాను తిరస్కరించడం సరయినదేనని ఫ్రాన్స్ రాజధాని నగరంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు రుజువు చేశాయని శనివారం ఉదయం ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. పోలాండ్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) నేతృత్వంలో వాతావరణ మార్పుపై చర్చలు జరుగుతుండగానే మధ్యలో ట్రంప్ తన ఉదయం ట్వీట్‌లో పారిస్ ఒప్పందంపై వ్యాఖ్యానించారు. 2015లో పారిస్‌లో కుదిరిన వాతావరణ మార్పు ఒప్పందంపై ఒక యూనివర్సల్ రూల్‌బుక్‌ను ఆమోదించడానికి సుమారు 200 దేశాలు పోలాండ్‌లో చర్చలు జరుపుతున్నాయి. ‘పారిస్ ఒప్పందం పారిస్‌కు కూడా మంచిగా పనిచేయడం లేదు. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం మూడో ప్రపంచ దేశాలకు పెద్ద మొత్తంలో నిధులు అందజేయాలని కోరుకోవడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

చిత్రం..అమెరికా అధ్యక్షుడు ట్రంప్