అంతర్జాతీయం

ఇటలీ నైట్‌క్లబ్‌లో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరినాల్డో (ఇటలీ), డిసెంబర్ 8: ఇటలీలోని నైట్‌క్లబ్‌లో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఐదుగురు టీనేజీ వయస్సులో ఉన్న బాలబాలికలు ఉన్నారు. ఒక పాప్ మ్యూజిక్ కార్యక్రమంలో యువత మునిగి తేలుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొంత మంది పెప్పర్ స్ప్రే ఉపయోగించడం వల్ల ఆందోళనకు గురికావడంతో, క్లబ్‌లో గందరగోళం నెలకొంది. దీంతో యువకులు ఒకసారి బయటకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఒకరిమీద ఒకరు పడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్లబ్‌కు మూడు ద్వారాలు ఉన్నాయి. ఈ ఘటన సెంట్రల్ ఇటలీలో ఆంకోనాకు సమీపంలోని కొరినాల్డో పట్టణంలో జరిగింది. ఈ వివరాలను ఫైర్ సర్వీసస్ విభాగం వెల్లడించింది. 14 మంది వ్యక్తులకు తీవ్రగాయాలు తగిలాయి. మరో 40 మంది సాధారణ గాయాలు తగిలాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఉన్న వారి పరిస్థితి విషమించింది. ఒక్కసారి యువతీయువకులు బయటకు వెళ్లడానికి ప్రయత్నించడంతో రైలింగ్ కూడా కూలింది. మరణించిన వారిలో టీనేజి వయస్సులో ఉన్న ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఎమర్జన్సీ ద్వారాలు కూడా తెరుచుకోలేదని గాయపడిన ఒక బాలుడు చెప్పాడు. ఈ తరహా మ్యూజిక్ కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయని, కాని విషాదం సంభవిస్తుందని, తమ పిల్లలు మరణిస్తారని ఊహించలేదని మృతి చెందిన పిల్లల తల్లితండ్రులు విలపించారు.