అంతర్జాతీయం

హెచ్-1బి, ఎల్-1పై మళ్లీ ఆంక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 9: హెచ్-1బి, ఎల్-1 వీసాల ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న నారతీయ ఐటి కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బే తగలనుంది. ఇకపై ఈ వీసాలకు అనుమతి ఇవ్వరాదంటూ, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ద్వైపాక్షిక సభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. న్యూజెర్సీకి చెందిన డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు బిల్ పాస్క్రెల్, కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రోరబాచర్‌లు ప్రవేశపెట్టిన ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే అమెరికాలో భారతీయ ఐటి కంపెనీలకు శరాఘాతమే అవుతుంది. ప్రస్తుతం అమెరికాలోని పలు ఐటి కంపెనీలు హెచ్-1బి, ఎల్-1 వీసాల ద్వారా ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. ఫలితంగా నిపుణులైన అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వీసాలలో సంస్కరణలు తీసుకు రావాలని కోరుతూ వీరు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే, 50 మందికన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే లేదా మొత్తం ఉద్యోగుల్లో హెచ్-1బి, ఎల్-1 వీసాలపై వచ్చిన వారు 50 శాతం ఉన్న కంపెనీలు ఈ వీసాలపై ఉద్యోగులను తీసుకోకూడదు. ‘అమెరికా మంచి నిపుణులను తయారు చేస్తోంది. కళాశాలలనుంచి వేలాది మంది అత్యుత్తమ నిపుణులు తయారై బైటికి వస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఉపాధి లభించడం లేదు. అందుకే వీసా విధానంలో సంస్కరణలు తీసు రావలసిన అవసరం ఉంది’ అని పాస్క్రెల్ అంటున్నారు. హెచ్-1బి, ఎల్-1 వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు పలు వార్తలు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. పాస్క్రెల్,రోరబాచర్‌లు 2010లో సైతం ఇలాంటి బిల్లునే ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్‌లో మెజారిటీ సభ్యుల మద్దతు లభించక పోవడంతో అది వీగి పోయింది. అయితే తాము ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఈ వీసా ప్రోగ్రామ్‌లలో ఉన్న లొసుగులను తొలగించేస్తుందని వారంటున్నారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తేనే అధ్యక్షుడు దీనికి ఆమోదముద్ర వేస్తారు.