అంతర్జాతీయం

మాలి సరిహద్దులో మారణకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బమాకో, డిసెంబర్ 13: ఈశాన్య మాలీ సరిహద్దులో సాయుధ దళాలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారు. నిగర్ సరిహద్దులోని ఈ ప్రాంతంలోని ఇళ్లపై దాడులు జరిపిన ఆగంతక ముఠా సభ్యులు పెద్ద సంఖ్యలో పౌరుల్ని కాల్చిచంపారని అధికారులు గురువారం తెలిపారు. గత కొన్ని రోజులుగా జిహాదీ హింసాకాండతో అట్టుడుకుతున్న ప్రాంతంలోనే ఈ దాడి జరిగిందని వెల్లడించారు. మోటారు బైకులపై వచ్చిన దుండగ ముఠా మనేక ప్రాంతంలో నివసిస్తున్న ఇదాక్‌సహక్ కమ్యూనిటీ ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు లాగి అత్యంత హేయంగా కాల్చిచంపారని, ఈ కాల్పుల్లో 47మంది మరణించారని తెలిపారు. ఈ కాల్పుల్లో ఎంత మంది మరణించిందీ స్పష్టంగా చెప్పలేనప్పటికీ మృతుల సంఖ్య డజన్లలోనే ఉంటుందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఓ అధికారి తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతానికి సైనికులు చేరుకునే సమయానికే సాయుధ ముఠా పారిపోయిందని అన్నారు. ఈ దాడిని మాలిలోని ఐరాస మిషన్ తీవ్ర పదజాలంతో ఖండించింది. ఈ మారణకాండకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, జరిగిందేమిటో తెలుసుకునేందుకు మానవ హక్కుల బృందాలను పంపుతున్నామని తెలిపింది.