అంతర్జాతీయం

నేపాల్‌లో భారత్ కరెన్సీ వినియోగంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండూ, డిసెంబర్ 14: నేపాల్ ప్రభుత్వం భారత్ కరెన్సీ రూ.2000, రూ.500, రూ.200 నోట్ల చలామణిని ర ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యతో భారత్ ప ర్యాటకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది. నేపాల్‌లో భారత్ కరెన్సీని విస్తృతంగా ఉపయోగిస్తారు. నేపాల్‌లో ప్రజ లు వంద రూపాయలు కంటే ఎక్కువగా భారతీయ కరెన్సీని తమ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వం కోరింది. ఈ విషయమై నేపాల్ సమాచార శాఖ మంత్రి గోకుల్ ప్రసాద్ భాస్కోటా విలేఖర్లతో మాట్లాడుతూ నిషేధించిన కరెన్సీని తమ వద్ద ఉంచుకోవద్దని ప్రజలను కోరారు. ఈ విషయమై ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. భారత్‌లో పనిచేస్తున్న నేపాలీ కార్మికులు, అలాగే నేపాల్‌లో పర్యటించే భారత పర్యాటకులపై పెను ప్రభావం చూపిస్తుంది. గతంలో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ రద్దు వల్ల నేపాల్, భూటాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది.