అంతర్జాతీయం

విశ్వసుందరి కేట్రియోనా గ్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, డిసెంబర్ 17: ఫిలిప్పిన్స్‌కు చెందిన కాట్రియోనా గ్రే 2018కి సంబంధించి విశ్వసుందరిగా ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పోటీపడ్డ ఈ కార్యక్రమం సోమవారం బ్యాంకాక్‌లో ముగిసింది. 93 దేశాలకు చెందిన సుందరీమణుల పోటీని తట్టుకుని విశ్వసుందరి కిరీటాన్ని కాట్రియోనా (24) దక్కించుకుంది. అనంతరం మాట్లాడిన ఆమె ‘నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడే ఎరుపురంగు కలిగిన దుస్తులతో విశ్వసుందరి కిరీటం నీ సొంతం అవుతుంది’ అని తన తల్లి తనతో అన్నట్టుగా గుర్తు చేసుకున్నారు. ఈ పోటీల్లో ద్వితీయస్థానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన టేమరిన్ గ్రీన్, వెనిజులాకు చెందిన స్ట్ఫోనీ గూయిరజ్ మూడోస్థానాన్ని పొందారు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెల్చుకున్న నాలుగో ఫిలిప్పిన్స్ వనిత గ్రే కావడం గమనార్హం. ఫిలిప్పిన్స్ అతివల అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, సవాళ్లను ఎదుర్కొనే పటిమకు కేట్రియోనా నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని దేశ అధ్యక్షుడు రోడ్రిగో ప్రశంసించారు.

చిత్రం..కేట్రియోనా గ్రేకు విశ్వసుందరి కిరీటాన్ని అలంకరిస్తున్న 2017 విశ్వసుందరి నెల్-పీటర్స్