అంతర్జాతీయం

బ్రెగ్జిట్ వస్తే భారత్‌కు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 20: బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన నూతన వీసా, వలస వ్యూహాత్మక విధానం ఇప్పటివరకు ప్రొఫెషనల్స్‌పై విధించిన ఆంక్షలకు అడ్డుకట్ట వేసింది. భారత్ విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు మేలు చేకూర్చేలా ఈ నూతన ప్రతిపాదన ఉందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యూకే హోం సెక్రటరీ సజిద్ జావిద్ హౌస్ ఆఫ్ కామన్‌లో వలసవిధానంపై ప్రవేశపెట్టిన ప్రతిపాదన ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను తొలగించి విదేశీ విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు మేలు చేకూర్చేవిధంగా ఉంది. దీని ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని విద్యార్థులైనా ఇక్కడ చదువు అయిన తర్వాత పనిచేసే సౌకర్యాలు మెరుగవుతాయి. ఈ సందర్భంగా బ్రిటీష్ ప్రధాని నూతన వీసా, వలస విధానం గురించి వివరిస్తూ నైపుణ్యవంతులను ప్రోత్సహించడానికి వలసదారులను తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు. తాము యూరోపియన్ యూనియన్‌ను విడిచిపెట్టిన తర్వాత స్వేచ్ఛాయుత విధానం ముగిసిందని, ఇప్పుడు ఆవిష్కరించిన నూతన వీసా విధానం వల్ల ప్రపంచంలోని ఏమూలనున్న ప్రతిభావంతులకైనా తమ దేశం ఆహ్వానం పలుకుతుందని అన్నారు. దీనివల్ల ఎక్కువ మంది వలసదారులు తమ దేశం పట్ల ఆకర్షితులవుతారని తెలిపారు. నూతన విధానం వల్ల డాక్టర్లు, ఐటి ఫ్రొఫెషనల్స్ వంటి 27వేల మందికి లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో అలాగే కార్మికులు, నైపుణ్యం తక్కువ ఉన్న వారిని నియమించుకునేందుకు 12నెలల కాలపరిమితితో వీసాను మంజూరు చేస్తారు. ఇలా వచ్చే వారు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. అలాగే వారు ఇక్కడ స్థిరపడే హక్కును కలిగి ఉండారు. వీసా కాలపరిమితి పూర్తయిన వెంటనే వారు తమతమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని యూకే అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా బ్రిటన్ నిర్ణయాన్ని కాన్ఫరెన్స ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) స్వాగతించింది.