అంతర్జాతీయం

పొంచి ఉన్న అణుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, డిసెంబర్ 20: ఇటీవలి కాలంలో అమెరికాతో సంబంధాలు మరింతగా తీవ్రమవుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అణు యుద్ధ వాతావరణం పెరిగిపోతోందని ఇదే జరిగితే మొత్తం నాగరిక ప్రపంచమే నాశనమైపోతుందని, అలాగే ఈ భూగోళం కూడా తుడిచిపెట్టుకు పోవచ్చునని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అందుకు ప్రధాన కారణం అమెరికానే అవుతుందని కూడా పుతిన్ అన్నారు. వార్షికంగా జరిగే మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్ తాను ప్రపంచ దేశాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నానంటూ పశ్చిమ దేశాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. కానీ, తమతమ వ్యక్తిగత కారణాలతో పశ్చిమ దేశాలే రష్యాతో వైరాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల రష్యాలు ఎలాంటి నష్టం ఉండదని, ఆ దేశాలకే వినాశకంగా పరిణమిస్తుందని తెలిపారు. బ్రిటన్, అమెరికాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పుతిన్ తేల్చిచెప్పారు. నిజానికి ప్రపంచ దేశాలను రక్షిస్తున్నది తానేనని చెప్పుకున్న పుతిన్ ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని ప్రస్తావించారు. మధ్యంతర శ్రేణి క్షిపణులను కనుక ఐరోపాలో మోహరించేందుకు అమెరికా ప్రయత్నిస్తే మాత్రం అందుకు ప్రతిగా తాము కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా వైఖరి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ నియంత్రణ వ్యవస్థే దెబ్బతింటోందని అన్నారు. అణ్వాయుధాలకు సంబంధించి నియంత్రణ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేయడం వల్ల అది ప్రపంచ వినాశనానికే దారితీస్తుందన్నారు.

చిత్రం..రష్యా అధ్యక్షుడు పుతిన్