అంతర్జాతీయం

ఆఫ్గన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ కాబూల్, డిసెంబర్ 21: ఆఫ్గనిస్తాన్ నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 14,000 మంది దళాలు ఆఫ్గనిస్తాన్‌లో విధులు నిర్వర్తిసుండగా అందలో సగం మందిని స్వదేశానికి తిరిగి రప్పిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే ట్రంప్ నిర్ణయం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని సెనెటర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. 9/11 లాంటి ఉపద్రం తప్పదని వారు పేర్కొన్నారు. ఇలా ఉండగా దళాలను ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై కాబుల్‌లోని విదేశీ రాయబారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
అకస్మాత్తుగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్ ఉగ్రవాదుల చర్యలతో ఆఫ్గనిస్తాన్ అట్టుడికిపోయింది. అయితే సంకీర్ణ దళాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సరిహద్దుల్లో మాత్రం ఆఫ్గన్ దళాలకు ఉగ్రదాడులు తప్పడంలేదు. ట్రంప్ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తాలిబన్ ఉగ్రవాద సంస్థ అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని హర్షించింది. ‘మీ శత్రువుసగం దళాలను వెనక్కితీసుకుపోతున్నాడు. మీరు కాల్పుల విరమణ పాటిస్తారా?’ అన్న ప్రశ్నకు తాలిబన్ అధికార ప్రతినిధి జబిఉల్లా ముజాహిద్ ఎలాంటి బదులూ ఇవ్వలేదు. అయితే ఓ సీనియర్ కమాండర్ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని హర్షించాడు. ‘నిజం చెప్పాలంటే అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మేం ఊహించనేలేదు’అని ఓ అజ్ఞాత ప్రాంతం నుంచి ఓ వార్త సంస్థతో అన్నాడు. ‘ముందు ముందు మరిన్ని మంచి వార్తలు వింటాం. వాస్తవం ఏమిటో వారికిప్పుడు అర్థమైంది’అని కమాండర్ పేర్కొన్నాడు. కాగా తాజా పరిణామాలపై ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అధికార ప్రతినిధి మాత్రం ఆచితూచీ స్పందించారు.
‘అమెరికా దళాలు ఉపసంహరించుకున్నంత మాత్రాన దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండదు. నాలుగున్నర ఏళ్లుగా ఆఫ్గన్‌లో పరిస్థితలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి’అని అధ్యక్షుడు ప్రతినిధి హరూన్ ఛఖాన్‌సురి వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆఫ్గనిస్తాన్ నుంచి దళాలు ఉపసంహరణ ఇరుదేశాలకు ప్రమాదకరమని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ లిండ్సే గ్రహం హెచ్చరించారు. ఈ నిర్ణయం ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఊతాన్ని ఇస్తుందని సౌత్ కరోలినా సెనెటర్ అన్నారు.