అంతర్జాతీయం

222 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేషియాలో సునామీ బీభత్సం* 843 మందికి గాయాలు రీ 28 మంది గల్లంతు
* అగ్నిపర్వతం పేలడంతోనే ఈ దుర్ఘటన* సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
జకార్తా, డిసెంబర్ 23: ఇండోనేషియాలో శనివారం రాత్రి సంభవించిన సునామీ బీభత్సానికి 222 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. సుమత్రా దీవుల్లో కర్తిటా బీచ్‌లో ఉన్న ప్రజలను సునామీ అలలు మింగేశాయి. సముద్రంలో సంభవించిన అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆకస్మాత్తుగా సునామీ వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. సునామీ వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సునామీ వల్ల రాకాసి అలల తాకిడికి వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ సుమత్రా, పవ్మి జావా మధ్య కర్తిటా బీచ్‌లో సునామీ ప్రకృతి విపత్తు సంభవించింది. పెద్ద ఎత్తున రక్షణ, ప్రకృతి విపత్తు నియంత్రణ బృందాలను రంగంలోకి దింపినట్లు అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి బీచ్‌లో యువకులు, పెద్దలు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. కాని ఉన్నంట్టుడి సునామీ రాకాసి అలలు ముంచెత్తడంతో బీచ్‌లో చేరిన వారిలో చాలా మంది కొట్టుకుపోయారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సునామీ వచ్చిన సమయంలో బీచ్‌లో సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఈ ఘటనలో 843 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరో 28 మంది గల్లంతయ్యారు. అకస్మాత్తుగా అగ్నిపర్వతం పేలడంతో ఆ శూన్యతను భర్తీ చేసేందుకు సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో సునామీ రాకాసి అలలు బీచ్‌ను ముంచెత్తాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒక ఫోటో గ్రాఫర్ ఓస్టిన్ ఆండర్‌సన్ సునామీ బీభత్సం ప్రళయాన్ని గుర్తు చేసిందన్నారు. జీవితంలో ఎన్నడూ చూడని అతి పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున ఎగసిపడుతూ వచ్చే సంగీత విభావరిలో మునిగి తేలుతున్న బృందాన్ని తీసుకెళ్లిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. అలల నుంచి తప్పించుకునేందుకు తాను వేగంతో పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నట్లు ఆయన చెప్పారు. కార్లు పది మీటర్ల ఎత్తున లేచి పడ్డయి.
అలలు వేగంగా రావడం చూసి అక్కడ ఉన్న తన బైక్‌ను స్టార్ట్ చేసి వెళదామనుకుంటే స్టార్ కాలేదని దాంతో దాన్ని వదిలేసి పరుగెత్తానని 23 సంవత్సరాల యువకుడు చెప్పాడు. అనక్ క్రాకటో అనే అగ్నిపర్వతంలో సంభవించిన విస్ఫోటనం వల్ల సునామీ వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముందు ఈ అలలు సునామీ కాదని చెప్పినా, ఆ తర్వాత సునామీ అని ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. మృతుల్లో ఎక్కువ మంది సమీపంలోని హోటళ్లలో ఉంటున్నారు.
చిత్రం..ఇండోనేషియాను మరోసారి ఓ పెను సునామీ కుదిపేసింది. 222 మంది మరణించిన ఈ విలయంలో హోటళ్లకు హోటళ్లు, ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయిన దృశ్యాలు