అంతర్జాతీయం

సర్వం కోల్పోయాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరిటా (ఇండోనేషియా), డిసెంబర్ 24: హఠాత్తుగా శనివారం రాత్రి పెద్ద శబ్దం చేస్తూ విరుచుకుపడిన సునామీ ధాటికి సర్వం కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ రోజు రాత్రి హుష్ మంటూ పెద్ద శబ్దం వచ్చింది.. మొదట నేను అది హోరు గాలి అనుకున్నా.. తీరా చూస్తే కొద్దికొద్దిగా నీరు మా గ్రామంలోకి చేరుకుంది. చూస్తుండగానే పెద్దమొత్తంలో వచ్చి మా గ్రామాన్ని ముంచెత్తింది.. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది.. ఎలాంటి హెచ్చరికలు లేవు.. మేమెవ్వరం ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని ప్రమాదం నుంచి బయటపడ్డ సుకరామె గ్రామం నుంచి బయటపడ్డ అసీప్ సునేరియా అనే గ్రామస్తుడు తన అనుభవాన్ని వివరించాడు. వెంటనే తాను, తన కుటంబ సభ్యులు గ్రామంలోని ఎత్తయిన ప్రాంతానికి చేరుకున్నామని, గ్రామంలోని చాలామంది నీటిలో కొట్టుకుపోయారని, ఇప్పుడు నీరు తగ్గిన తర్వాత వారి మృతదేహాల కోసం వెతుకుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కట్టుబట్టలతో మిగిలామని, తమ ఇళ్లు కూలిపోయాయని, వస్తువులు కొట్టుకుపోయాయని పలువురు బాధితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన సునార్తి మాట్లాడుతూ తమ గ్రామంలో చాలా మంది మృతి చెందారని, ఇప్పటివరకు రెండు మృతదేహాలను మాత్రమే కనుగొన్నామని చెప్పాడు. మళ్లీ ఏ క్షణాన రాకాసి అలలు విరుచుకుపడతాయోనని భయపడుతున్నామని ఆయన తెలిపాడు. కాగా, బీచ్ సమీపంలో బహిరంగ ప్రదర్శన ఇస్తున్న ఇండోనేషియన్ పాప్ బ్యాండ్ బృందంలోని పలువురు సభ్యులు సైతం శనివారం రాత్రి సునామీ బారిన పడటంతో పలువురు మృతి చెందారు. వారిలో కొందరి జాడ ఇంకా తెలియక సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన సభ్యులకు సోమవారం అంతిమసంస్కారాలు నిర్వహించారు.

చిత్రం..ఇండోనేషియాలో పెను సునామీకి నేల కూలిన ఇళ్లనుంచి తమ వస్తువుల కోసం వెదుకుతున్న గ్రామస్థులు