అంతర్జాతీయం

ప్రేమను పంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక్కడి సెయింట్ పీటర్స్‌బాసిలికా చర్చిలో సోమవారం రాత్రి జరిగిన వేడుకలకు వేలాది మంది హాజరు కాగా, పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.3 బిలియన్‌ల కాథలిక్‌లకు ఉద్దేశించి తన సందేశాన్ని అందజేశారు. దురాశని విడిచిపెట్టి తోటివారికి ప్రేమను పంచాలని, క్రిస్మస్ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని తన సందేశంలో పేర్కొన్న ఆయన ప్రపంచంలో కొద్దిమంది సమాజంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండగా, చాలామంది రోజుకు కనీసం రొట్టె ముక్క సైతం దొరకని దుర్భర స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శాంతాక్లాజ్ టోపీలు ధరించిన పలువురు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అతిపెద్ద క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తాము పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. ప్రపంచంలోని పలుదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని మతాధికారుల సందేశాలను భక్తిశ్రద్ధలతో ఆలకించారు. అలాగే అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక చిన్నారిని ‘నీవు శాంతాక్లాజ్‌ను నమ్ముతావా’ అని చిలిపిగా ప్రశ్నించి నవ్వులు పూయించారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు చాలా ప్రశాంతంగా జరిగాయని బెత్లెహాంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి పాలస్తినాలోని ఒక పట్టణం నుంచి తన కొడుకు, కూతురుతో వచ్చిన అబీర్ నాసర్ అనే భక్తుడు పేర్కొన్నారు. రాజకీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా తాను భయంభయంగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనేవాడినని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని అన్నారు. కాగా, ఈ ఏడాది జరిగే క్రిస్మస్ వేడుకల్లో హింసాత్మక సంఘటనలు జరగవచ్చునని తొలుత మతాధికారులు భావించారు. పోప్ ఫ్రాన్సిస్ సైతం కొన్ని అతివాద సంస్థలు చర్చిలు, ఇతర ప్రార్థనా ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చునని, జాగ్రత్తగా ఉండాలని శుక్రవారం చర్చి నిర్వాహకులను కోరారు. అయితే వేడుకలు ప్రశాంతంగా జరగడంతో మతాధికారులు, అధికారులు, భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.
చిత్రం..వాటికన్ సిటీలోని సెయంట్ పీటర్స్ బాసిలికాలో జరిగిన వేడుకల్లో
బాలయేసు పాదాలను ముద్దాడుతున్న పోప్ ఫ్రాన్సిస్